Loksabha Elections 2024 : ప్రధానిగా రెండుసార్లు అవకాశం వచ్చినా నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఎలాంటి మేలు చేయలేదని ఆర్జేడీ నేత, పాటలీపుత్ర నుంచి ఆ పార్టీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన మిసా భారతి ఆరోపించారు. నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్నా ఉపాధి కల్పన కోసం ప్రధాని మోదీ ఎలాంటి చర్యలూ చేపట్టలేదని అన్నారు.
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోదీ ఆ పనిచేయలేదని మండిపడ్డారు. బిహార్లో ఎలాంటి కొత్త పరిశ్రమలు రాలేదని, ఉపాధి లేక ఇక్కడి యువత వలస బాట పట్టారని అన్నారు. ఆర్మీలో నియామకాల కోసం చేపట్టిన అగ్నివీర్ స్కీమ్ ఎలా ఉందో అందరూ చూస్తున్నారని చెప్పారు.
బీజేపీ పాలనపై విసిగి వేసారిన ప్రజలు ఇండియా కూటమి వైపు చూస్తున్నారని, బిహార్లో మహా కూటమి ఘనవిజయం సాధిస్తుందని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమికి అనుకూల పవనాలు వీస్తున్నాయని చెప్పారు. మోదీ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని ఆమె విమర్శలు గుప్పించారు.
Read More :