e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News దేశంలోనే నెంబర్‌ వన్‌ హెల్త్‌ వర్సిటీ నా లక్ష్యం : మంత్రి మ‌ల్లారెడ్డి త‌న‌యుడు భ‌ద్రారెడ్డి

దేశంలోనే నెంబర్‌ వన్‌ హెల్త్‌ వర్సిటీ నా లక్ష్యం : మంత్రి మ‌ల్లారెడ్డి త‌న‌యుడు భ‌ద్రారెడ్డి


Dr. Ch. Bhadra Reddy | ఎన్ని డిగ్రీలు ఉన్నా హస్తవాసి ఉంటేనే వైద్యుడిగా రాణించగలరు. ఈ యువ వైద్యుడు తనను తాను నిరూపించుకోవడమే కాదు, ప్రతి సంవత్సరం 500 మంది యువ వైద్యులను తయారు చేస్తున్నారు. ఏటా ఐదున్నర లక్షల మంది నిరుపేదలకు తక్కువ ఖర్చుతో కార్పొరేట్‌ వైద్యం అందించే హెల్త్‌ సిటీని సమర్థంగా నిర్వహిస్తున్నారు. 750 పడకల సూపర్‌ స్పెషాలిటీ దవాఖానతోపాటు 762 సీట్ల సామర్థ్యం ఉన్న వైద్య కళాశాలను నిర్వహిస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. తమ సంస్థ దేశంలోనే నెంబర్‌ వన్‌ హెల్త్‌ యూనివర్సిటీ కావాలన్న లక్ష్యంతో పట్టుదలగా పని చేస్తున్నారు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తనయుడు, మల్లారెడ్డి హెల్త్‌ సిటీ చైర్మన్‌ డాక్టర్‌ భద్రారెడ్డి. ఆరేండ్లుగా వైద్యరంగంలో దూసుకుపోతున్న ఈ యువవైద్యుడు తన అనుభవాలను ‘జిందగీ’తో పంచుకున్నారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

Dr. Ch. Bhadra Reddy


విద్యారంగంలో ప్రత్యేక ముద్ర సాధించాలన్నది మా నాన్న మల్లారెడ్డి కల. 2004లో మల్లారెడ్డి గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (ఎంఆర్‌జీఐ) ప్రస్థానం మొదలైంది. మొదట ఇంజినీరింగ్‌, తర్వాత మెడికల్‌ కాలేజీలు స్థాపిస్తూ ఒక్కో కొమ్మను విస్తరిస్తూ మహావృక్షంగా తీర్చిదిద్దాం. ఈ చదువులమ్మ నీడలో ఏటా వేలాది విద్యార్థులు పట్టాలు అందుకొని జీవితాల్లో స్థిరపడుతున్నారు. ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పంతో వైద్య కళాశాల, సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ ఏర్పాటయ్యాయి. 2009లో పుణెలో నా వైద్య విద్య పూర్తయింది. తర్వాత పీజీ చేశాను. 2009లో కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోని సూరారంలో ‘మల్లారెడ్డి హెల్త్‌సిటీ’ ప్రారంభించాం. ఆరేండ్ల కిందట హెల్త్‌సిటీ బాధ్యతలు చేపట్టి అన్నివిధాలా అభివృద్ధి చేశాం. నాతోపాటు వైద్య విద్యను పూర్తి చేసిన డాక్టర్‌ ప్రీతిరెడ్డి నా ప్రయాణంలో తోడుగా నడిచింది.

రాష్ట్రంలోనే అతిపెద్ద హెల్త్‌సిటీ

- Advertisement -

మా సంస్థ ఇప్పుడు తెలంగాణలోనే అతిపెద్ద హెల్త్‌సిటీగా రూపుదిద్దుకుంది. వివిధ విభాగాల్లో నిష్ణాతులైన 400 మంది వైద్యులు, మూడువేలకు పైగా సిబ్బందితో అన్ని విభాగాల్లో మెరుగైన వైద్యాన్ని అందిస్తున్నాం. నిపుణులలో 300 మంది ప్రభుత్వ వైద్యులు (రిటైర్డ్‌) ఉండటం విశేషం. 750 పడకలతో విస్తరించిన సూపర్‌ స్పెషాలిటీ విభాగం సహా మొత్తం 1,250 పడకలతో సేవలు అందిస్తున్నాం. రోజూ 1,500 మంది వరకు ఔట్‌ పేషెంట్‌ (ఓపీ) రోగులు నమోదు అవుతున్నారు. ఏటా రెండులక్షల మంది ఇన్‌పేషెంట్లుగా సేవలు పొందుతున్నారు.

సంపాదన లక్ష్యం కాదు

సూపర్‌ స్పెషాలిటీ దవాఖాన ద్వారా డబ్బులు ఆర్జించడం మా లక్ష్యం కాదు. తక్కువ ఖర్చుతోనే నిరుపేదలకు కార్పొరేట్‌ వైద్యాన్ని అందిస్తున్నాం. అందుకే తెలంగాణతోపాటు ఇతర రాష్ర్టాల నుంచి కూడా రోగులు మా వద్దకు వస్తుంటారు. ఇక్కడ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. మందుల ఖర్చు మాత్రమే రోగి భరించాల్సి ఉంటుంది. ఔషధాల్ని దవాఖాన ప్రాంగణంలోని ఫార్మా నుంచి మాత్రమే తీసుకోవాలనే నిబంధన కూడా లేదు. ఇతర వైద్య సంస్థలు వసూలు చేసే ఫీజుతో పోలిస్తే 40-50 శాతం తక్కువ రుసుముతో శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నాం. రోగ నిర్ధారణ పరీక్షలకు బయటితో పోల్చుకుంటే 30-50 శాతం తక్కువ చార్జ్‌ చేస్తున్నాం. మరో విశేషం ఏమిటంటే… హాస్పిటల్‌ డెలివరీలు పెంచాలనే ఉద్దేశంతో మా దగ్గర జరిగే కాన్పులకు.. మగ పిల్లవాడు పుడితే రూ.3,000, ఆడపిల్ల పుడితే రూ.5,000 ప్రోత్సాహకంగా ఇస్తున్నాం.

వర్సిటీగా నిలపడమే ధ్యేయం

మల్లారెడ్డి హెల్త్‌ సిటీ వేలమంది నిరుపేదలకు సేవలు అందిస్తున్నదంటే అది నాన్న ప్రోత్సాహంతోనే. ఆయన విజన్‌, ప్యాషన్‌, మోటివేషన్‌ నన్ను ముందుకు నడిపిస్తున్నాయి. ప్రధానంగా మల్లారెడ్డి హెల్త్‌ సిటీని యూనివర్సిటీగా అప్‌గ్రేడ్‌ చేసి, దేశంలోనే నెంబర్‌వన్‌ హెల్త్‌ యూనివర్సిటీగా నిలపాలన్నదే నాన్న కల, నా ఆశయం. ఆ దిశగా ఇప్పటికే అనేక మైలురాళ్లు దాటాం. త్వరలోనే ఆ మజిలీని చేరుకుంటామనే ధీమా ఉంది.

దేశంలోనే తొలి మహిళా వైద్య కళాశాల…

మల్లారెడ్డి హెల్త్‌సిటీలో మహిళా వైద్య కళాశాల స్థాపన నాన్న ఆశయం. 2012లో 150 ఎంబీబీఎస్‌, వివిధ విభాగాల్లో 68 ఎండీ/పీజీ సీట్లతో మొదలైన ప్రస్థానం, ఇప్పుడు దేశంలోనే తొలి మహిళా వైద్య కళాశాల (మైనారిటీలది కాకుండా)కు వేదికగా నిలవడమనేది తెలంగాణకు గర్వకారణం. 2013లో వంద బీడీఎస్‌, 12 ఎండీఎస్‌ పీజీ సీట్లతో మల్లారెడ్డి దంత వైద్య కళాశాల ప్రారంభమైంది. మా సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చికిత్స కోసం వచ్చే రోగులను గమనించడం అన్నది వైద్య విద్యార్థుల కెరీర్‌కు దోహదం చేస్తుంది. నిరుపేదలకు తక్కువ ఖర్చుతో కార్పొరేట్‌ వైద్యం అందిస్తున్న సంతృప్తితోపాటు, వైద్య విద్యార్థులకు హెల్త్‌సిటీ ద్వారా ప్రయోజనం కలిగించడం నాకెంతో సంతోషాన్ని ఇస్తున్నది.

✍ గుండాల కృష్ణ

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

విజ‌య్ దేవ‌ర‌కొండ ఇచ్చిన మాట నిల‌బెట్టుకున్నాడు : ఇండియ‌న్ ఐడ‌ల్ సింగ‌ర్ ష‌ణ్ముఖ ప్రియ‌

అత‌ని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశ‌మంత‌..

Ira singhal | దివ్యాంగురాలైనా ఆమె ఎంతోమందికి ఇన్‌స్పిరేష‌న్‌.. ఐఏఎస్ సాధించ‌డ‌మే కాదు..

gongadi trisha | క్రికెట్‌లో యువ సంచ‌ల‌నం మ‌న తెలంగాణ అమ్మాయి త్రిష‌..

Matilda Kullu | వ్యాక్సిన్లు వేసే ఆశావ‌ర్క‌ర్ ఫోర్బ్స్ జాబితాలోకి.. ఎలా సాధ్య‌మైంది?

rema rajeshwari | ఫోర్బ్స్‌ జాబితాలో.. తెలంగాణ ఐపీఎస్‌

యాభై ఏళ్ల వ‌య‌సులో బిజినెస్ స్టార్ట్ చేసి.. వంద‌ల మంది ఆడ‌బిడ్డ‌ల‌కు ఉపాధి క‌ల్పిస్తున్నహైద‌రాబాదీ మ‌హిళ‌

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement