Zindagi Special stories 2021 | ప్రపంచానికి.. ఏడాది అంటే మూడువందల అరవై అయిదు రోజులు. జిందగీ-గౌరమ్మకు మాత్రం మూడువందల అరవై అయిదుమంది మహిళల గెలుపు కథనాలు. ఆమె ఎవరెస్టును అధిరోహిస్తే.. మాకు కొండెక్కినంత సంబురం! ఆమె సివిల్స్ సాధిస్తే.. మాకే కలెక్టరుగిరీ వచ్చినంత ఆనందం! ఆమె స్టార్టప్‌కు నిధులొస్తే.. మా ఇంట్లో లంకె బిందెలు దొరికినంత ఖుషీ! ఆమె పాటకు గుర్తింపు లభిస్తే.. మా గొంతులోనూ కించిత్ గర్వం. ఆమె కన్నీళ్లకు మా కాగితాలు తల్లడిల్లుతాయి. ఆమె ఉద్వేగాలకు మా అక్షరాలు కదిలిపోతాయి. ఆమె పోరాటాలకు మా కథనాలు జైకొడతాయి. ఆమె సమస్యలకు మా నిపుణులు పరిష్కారం చెబుతారు. ఆమె రుగ్మతలకు మా వైద్యులు చికిత్స సూచిస్తారు. ఆమె అందానికి మా బ్యుటీషియన్లు మెరుగులు పెడతారు. ఆమె చీరలకు మా డిజైనర్లు హంగులు అద్దుతారు. ఆమె ఆలోచనలను మా రచయితలు సువిశాలం చేస్తారు. ఆమె వ్యక్తిత్వానికి మా నిపుణులు సానబడతారు. జిందగీ.. ఒక వర్చువల్ పుట్టిల్లు. ప్రతి ఉదయం అక్షరాల గడపలో కాలుపెట్టండి. శీర్షికల బొట్టు పెట్టుకొని.. కథనాల సారెచీరలు స్వీకరించి.. చిట్కాల తాంబూలం అందుకోండి. కొత్త ఏడాదిలో కోటి శుభాలను ఆకాంక్షిస్తూ.. మీ.. జిందగీ-గౌరమ్మ
సూడాన్‌లో.. శాంతిపూలు పూయించాం!
చీకటి రాజ్యం సూడాన్‌లో శాంతి కాంతులు ప్రసరింపజేసింది మన కోహెడ బిడ్డ.. పల్లె పద్మ
తొలి ఫుడ్ డెలివరీ గాళ్ ( యువర్ ఆర్డర్.. మేడమ్! )
రచన.. రెండు చక్రాల బండి అన్నపూర్ణమ్మ! తెలంగాణ తొలి ఫుడ్ డెలివరీ గాళ్‌కు కుడోస్!
మార్పు తీర్పరులు ( కదిలింది.. కనకాపూర్ తండా! సారా నుంచి స్వయం ఉపాధి వైపు )
ఇంకానా ఇకపై వద్దు.. అంటూ పల్లెనంతా సారా వ్యాపారం నుంచి ఉపాధిమార్గం వైపు మళ్లించిన తండా మహిళలకు దండాలు.
కంచెతో కరచాలనం ( హద్దులు చెరిపి.. సరిహద్దుల వరకూ! )
పులిలాంటి చలిని, నక్కలాంటి శత్రువును.. లెక్కచేయకుండా సరిహద్దులలో విధులు నిర్వహిస్తున్నది బత్తుల లక్ష్మి.
అమ్మ మేనేజ్మెంట్ ( అమ్మ ఆలన పురపాలన )
పురపాలనకు అమ్మతనాన్ని జోడించిన మాతృమూర్తులకు వందనాలతో..
రికార్డు బద్దలు! ( నీ బుల్లెట్టు బండెక్కి వచ్చెత్తపా! )
విన్నారు. మళ్లీ విన్నారు. పాడారు. ఇంకా ఇంకా పాడుతూనే ఉన్నారు. మోహన భోగరాజు పాటకు లోకమంతా పట్టాభిషేకం చేస్తున్నది.
న్యాయదేవత ప్రతినిధి
తెలంగాణ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి హిమ కోహ్లి.. వ్యక్తిత్వం హిమశిఖరం కంటే ఓ మెట్టు ఎక్కువే. ఆ తీర్పరితనానికి తిరుగే లేదు.
జయం నీదే.. ( చిరుత వేగం.. విజయనందిని )
జాతీయ పరుగు పందాల్లో 8 స్వర్ణ పతకాలు సాధించిన బంగారు కొండ.. నందిని.
సేవా మార్గం ( నైటింగేల్ విజేత )
కొవిడ్ సమయంలోనూ కర్తవ్యమే ముఖ్యమని భావించిన సేవామూర్తి రూపకళ. నైటింగేల్ పురస్కారం ఆమెకు నమస్కరించింది.
చేతులు కలిపి.. ( నారీ సైన్యం! )
రెండు చేతులు కలిస్తే చప్పట్లు! మరి ఆరువేలమంది మహిళలు కలిస్తే.. అద్భుతాల ముచ్చట్లే!
ఆటంబాంబులు
పరుగుల రాణి, పతకాల సామ్రాజ్ఞి, రికార్డుల రాణెమ్మ! మిథాలీరాజ్ గురి ఇప్పుడు ప్రపంచకప్ మీదే.
స్వచ్ఛ భారతి! ( యోధురాలు మారుతమ్మ )
మారుతమ్మ చేతిలోని చీపురు మంత్రదండం కన్నా శక్తిమంతం. ఎక్కడ చెత్త ఉన్నా కనిపెట్టేస్తుంది.
అమ్మకు జేజే.. ( అమ్మ.. నా గైడ్, మెంటర్! )
పుస్తకాలు, కోచింగ్, మెటీరియల్.. వీటన్నిటికంటే అమ్మ ఇచ్చిన స్ఫూర్తి అతిగొప్పదని చాటింది.. శ్రీజ ఐఏఎస్.
చుక్కల్లో షికారు ( తెలుగు అమ్మాయికి ‘అంతరిక్ష’ ఖ్యాతి )
ఎవరైనా ఆకాశమే హద్దని అనుకుంటారు. శిరీష బండ్ల మాత్రం అంతకు పైనున్న అంతరిక్షానికి గురిపెట్టింది.
అందమైన హృదయం
అమ్మ హృదయ సౌందర్యాన్ని దేశానికి చాటిచెప్పి.. మాతృత్వాన్ని మహోన్నత పీఠమెక్కించిన ఖమ్మం మహిళ.. ఫర్హా
మెరుపు కలలు ( వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె )
వజ్రాల వ్యాపారమంటే .. వజ్ర సమానమైన సంకల్పం ఉండాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయగల వ్యాపార నీతీ తెలియాలి. మన్నె రాధికకు వెన్నతో పెట్టిన విద్య అది.
సౌందర్య లహరి..
మానస వారణాసి.. నడిచినంత మేరా సౌందర్య సామ్రాజ్యమే! కంటిచూపు ప్రసరించిన నేలంతా నందనవనమే. అందాల పోటీలోనూ తెలంగాణను గెలిపించిన అపరంజి బొమ్మ.
కిలిమంజారో కలికితురాయి
అన్విత సంకల్పం ముందు అంతెత్తు కిలిమంజారో కూడా చిన్నదైపోయింది. కొవిడ్ తర్వాత ఆ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయురాలు ఈ భువనగిరి బాలిక.
మన సచినమ్మ.. ( క్రికెట్లో యువ సంచలనం మన తెలంగాణ అమ్మాయి త్రిష )
బ్యాట్ పడితే పరుగులే. నాలుగు దిక్కులకూ బంతి ఉరుకులే! భద్రాద్రి బాలిక త్రిష క్రికెట్లో మెరుపులు మెరిపిస్తున్నది.
పట్టుదలతో పతకాల వేట
ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రీడా రత్నాలు..
సలాం సలీమా! ( తెలంగాణలో తొలి ముస్లిం ఐపీఎస్‌గా షేక్ సలీమా రికార్డ్.. )
పదోన్నతి ద్వారా ఐపీఎస్ సాధించిన తొలి తెలంగాణ ముస్లిం మహిళ.. సలీమా.
ఇంజినీరమ్మలు ( Engineers Day | తెలంగాణ గంగమ్మలు! )
తెలంగాణ నీటిపారుదల స్వప్నానికి రూపమిచ్చిన మహిళా ఇంజినీర్లకు వందనాలు.
భోజనాల భీమక్క! ( మూడేండ్ల క్రితం దాకా టీ పెట్టడం కూడా రాదు.. కానీ ఇప్పుడు మాస్టర్ చెఫ్ )
మాస్టర్ చెఫ్ కృష్ణ తేజస్వి ముందు నలభీములైనా నీళ్లు నమలాల్సిందే.
సూపర్.. బజార్ ( సూపర్ మార్కెట్స్! ‘స్వయం సహాయక’ విజయం )
కార్పొరేట్ల్ల ఆధిపత్యంలోని రిటైల్ సామ్రాజ్యానికి గ్రామీణ మహిళల దీటైన సవాలు
అపురూపం ( తెలంగాణ సౌందర్యమా )
సృజన, పరిశ్రమ కలబోత.. తెలంగాణలోని జిల్లా పాలన భవనాల రూపశిల్పి ఉషారెడ్డి .
బాలింతల డాక్టరమ్మ ( నాన్నను చూసి డాక్టరయ్యా! )
ఈ వైద్యురాలి హస్తవాసి అమోఘం. మనసున్న డాక్టరమ్మ.. ఎవిటా ఫెర్నాండెజ్ .
నాలుగో సింహం.. ( rema rajeshwari | ఫోర్బ్స్ జాబితాలో.. తెలంగాణ ఐపీఎస్ )
ఫేక్‌న్యూస్‌ను కట్టడి చేయడంలో మహా నేర్పరి .. ఐపీఎస్ రెమా రాజేశ్వరి!
నిశ్శబ్ద విప్లవం ( బధిరుల జ్యోతి! )
పదివేలమంది బధిర బాలలకు శబ్ద మాధుర్యాన్ని తెలిపిన జ్యోతి.. ఐరాస అవార్డు విజేత.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి