e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News వ‌జ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మ‌హిళ రాధిక మ‌న్నె.. ఎవ‌రామె.. ఆమె స‌క్సెస్ సీక్రెట్ ఏంటి?

వ‌జ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మ‌హిళ రాధిక మ‌న్నె.. ఎవ‌రామె.. ఆమె స‌క్సెస్ సీక్రెట్ ఏంటి?

Radhika manne | అసలే వజ్రాల వ్యాపారం. కోట్ల రూపాయల పెట్టుబడి. అంచనా తప్పితే సర్వం కోల్పోవాల్సిన పరిస్థితి. అందులోనూ, ఆ సవాలుకు సిద్ధపడింది ఓ మహిళ. సన్నిహితులు హెచ్చరించారు. ఆత్మీయులు భయపెట్టారు. కానీ ఆమె లెక్కచేయలేదు. అనుకున్నది సాధించాలనే తపన ధైర్యంగా అడుగు ముందుకు వేయించింది. ఆ దూకుడు గొప్ప ఫలితాన్ని ఇచ్చింది. దక్షిణాదిలో విజయవంతంగా వజ్రాల వ్యాపారం నిర్వహిస్తున్న ఏకైక మహిళగా రాధిక మన్నె రికార్డు సృష్టిస్తున్నారు. రిస్క్‌ ఉన్నా, ఇష్క్‌ ఉంటే విజయాలు సాధించవచ్చని నిరూపిస్తున్న రాధిక జర్నీ…

radhika manne
radhika manne


మాది గుడివాడ. నా ఎనిమిదేండ్ల వయసులో అమ్మ చనిపోయింది. ఆ వెలితి ప్రతి నిమిషం కలవర పెట్టేది. ఆ బాధ నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టింది. గుంటూరులోని తాత కృష్ణారావు, అమ్మమ్మ వనజాక్షి దగ్గర చదువుకున్నాను. పెద్ద బిజినెస్‌ చేయాలి, చాలా మందికి ఉపాధి చూపాలనేది నా లక్ష్యం. డిగ్రీ తర్వాత వివాహం చేసుకున్నాను. నా భర్త రవిచంద్ర బెంగళూరులో రియల్‌ ఎస్టేట్‌ చేస్తారు. చాలాకాలం అక్కడే ఉన్నాం. ఇంట్లో ఉంటూ హ్యాపీగా జీవితం గడిపే అవకాశం ఉన్నా, నాకెందుకో ఆ నాలుగు గోడల జీవితం నచ్చలేదు. మనిషి అన్నాక ఏదో ఒక లక్ష్యం ఉండాలి. గమ్యం వెంట పరుగెత్తాలి. వజ్రాల వ్యాపారానికి ముందు చాలా స్టార్టప్‌లు ప్రారంభించాను. బెంగళూరులో నర్సింగ్‌ మ్యాన్‌పవర్‌ కన్సల్టెన్సీ నిర్వహించాను. కొచ్చి, చెన్నై, బెంగళూరులో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశాం. మా దగ్గర శిక్షణ తీసుకున్న వారికి అమెరికాలో ఉద్యోగాలు ఇప్పించేవాళ్లం. కొన్ని కారణాల వల్ల కన్సల్టెన్సీని ఆపేశాం. అనంతరం హైదరాబాద్‌కు వచ్చాను. ఇక్కడే స్థిరపడ్డాం. నాకు నచ్చిన ప్రాంతాల్లో హైదరాబాద్‌ మొదటి స్థానంలో ఉంటుంది. అపార వ్యాపార అవకాశాలున్న నగరం ఇది.

- Advertisement -

వ్యాపారంలోకి..

పెండ్లయితే కలల్ని చిదిమేసుకోవాలా? బాధ్యతలు పెరిగే కొద్దీ ఆశయాలను వదిలేసుకోవాలా? అనుభవాల నుంచి పాఠం నేర్చుకొని, కొత్త వ్యాపారం ఎందుకు చేయకూడదు? అత్తామామలు నిర్మల, రవీంద్ర నాకు ఆదర్శం. ఎన్నో వ్యాపార సలహాలు ఇచ్చేవాళ్లు. డైమండ్స్‌ అంటే నాకు ఇష్టం. వాటి కోసం అనేక షోరూమ్స్‌ తిరిగేదాన్ని. సందేహాలు తీర్చుకునేదాన్ని. ఆ అభిరుచిని గమనించిన నా ఫ్రెండ్‌ కిసన్‌ వజ్రాల వ్యాపారం ప్రారంభించమని సలహా ఇచ్చాడు. ‘అంత పెద్ద బిజినెస్‌ నాతో అవుతుందా’ అనుకున్నాను. డబ్బులు ఉన్నాయి కదా అని, వ్యాపారం ప్రారంభించడం కాదు. ఆ రంగంలో నైపుణ్యం సాధించాకే షురూ చేయాలని నిశ్చయించుకున్నాను. ప్రాథమిక అవగాహన కోసం జెమాలజీ కోర్సులో చేరాను. అప్పటికి నా వయసు 34. డైమండ్‌ గ్రేడింగ్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌, డిజైనింగ్‌.. ఇలా అన్ని విభాగాలపైనా పట్టు సాధించాను. సొంతంగా వ్యాపారం చేయగలననే నమ్మకం వచ్చింది.

పాఠాలు నేర్చుకున్నా..

వజ్రాల వ్యాపారం నాకు చాలా నేర్పింది. డైమండ్స్‌ కోసం దేశమంతా తిరిగాను. విదేశాల్లో పర్యటించాను. ఆరేడు కోట్ల రూపాయల విలువైన వజ్రాలను వెంటబెట్టుకుని ఒక్కదాన్నే ప్రయాణించేదాన్ని. నా భర్త నాకు ప్రేరణ. ఆయన ప్రోత్సాహంతోనే అంత ధైర్యం వచ్చింది. ఇతర నగరాల నుంచి హైదరాబాద్‌కు బస్సులోనే వచ్చేదాన్ని. నగల డిజైనర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాను. అయితే, ఇదంతా ఒక్క రోజులో జరగలేదు. చాలా కష్టపడ్డాను. వజ్రాల వ్యాపారంలో నమ్మకం, స్థిరత్వం ప్రధానమని నేను నమ్ముతాను. నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌-2లో ‘రాధిక డైమండ్స్‌’ పేరుతో కస్టమైజ్డ్‌ జువెలరీ షోరూమ్‌ ప్రారంభించాను. వ్యాపారంలో విజయవంతంగా రాణిస్తూ ‘బెస్ట్‌ ఆంత్రప్రెన్యూర్‌’గా అవార్డులు సాధించాను. చోకర్స్‌, జుంకీలు, హారాలు, నెక్లెస్‌లు, గాజులు, బ్రేస్‌లెట్స్‌, ముక్కుపుడకలు.. మాదైన శైలిలో డిజైన్‌ చేస్తున్నాం. వివాహ ఆభరణాలు మా ప్రత్యేకత. పది వేల నుంచి కోట్ల రూపాయల ధర పలికే నగలు మా దగ్గర ఉన్నాయి. బెల్జియంలాంటి దేశాల నుంచి కూడా మేం వజ్రాలను దిగుమతి చేసుకుంటాం. ఇతర రాష్ట్రాల ప్రజల నుంచీ ఆర్డర్స్‌ వస్తాయి. ప్రస్తుతం 40 మందికి ఉపాధినిస్తున్నాం.

radhika manne
radhika manne

నమ్మకమే ప్రాణం

సెలబ్రిటీల ఇండ్లలో, రాజకీయ నాయకుల కుటుంబాల్లో, వ్యాపార పరివారాల్లో .. ఎక్కడ ఏ ఫంక్షన్‌, ఈవెంట్‌ జరిగినా మా వజ్రాభరణాలు తళుక్కుమనాల్సిందే. ఫ్యాషన్‌ షోలలో మేం డిజైన్‌ చేసిన కస్టమైజ్డ్‌ జువెలరీ ప్రత్యేక ఆకర్షణగా నిలవాల్సిందే. అసలు ఎన్ని రకాల వజ్రాలు ఉంటాయి? వాటిని ఎలా ఎంచుకోవాలి? నకిలీలను గుర్తించడం సాధ్యమేనా? రంగును బట్టి వాటి స్వభావాన్ని అంచనావేయడం ఎలా? .. తదితర అంశాలను మేం కస్టమర్లకు వివరిస్తాం. రంగు లేకుండా ఉండేదే బెస్ట్‌ డైమండ్‌. గోధుమ, పసుపు రంగుల్లో ఉంటే ధర కొంత తక్కువ పలుకుతుంది. ఏ వస్తువునైనా గుడ్డిగా అంటగట్టడం వల్ల వ్యాపారం జరుగుతుందేమో కానీ, కస్టమర్‌తో అనుబంధం ఏర్పడదు. విశ్వాసాన్ని కలిగించలేం. పారదర్శకతే నా విజయ రహస్యం. వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. దాంతోపాటు నమ్మకం కూడా!

…? ఇడుమాల కిరణ్‌ కుమార్‌

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..


నీకు సినిమాలు అవసరమా? నువ్వేం చేయగలవు? అని హేళ‌న చేశారు.. కానీ..

డాటర్‌ ఆఫ్‌.. సోమ్లా నాయక్‌!

PV sindhu |పద్మభూషణ్‌ అందుకున్న‌ప్పుడు పీవీ సింధు క‌ట్టుకున్న చీర ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా?

chand bali | అందాన్ని రెట్టించడానికి చాంద్‌బాలీ ఆభ‌ర‌ణాలు.. వీటిని మించిన ఫ్యాష‌న్ లేనే లేదు

ఫ్యాష‌న్ రంగంలో ఇప్పుడామె ఓ ట్రెండ్ సెట్ట‌ర్‌.. తొమ్మిదేళ్ల క్రితం ధైర్యం చేయ‌క‌పోయుంటే మాత్రం..

jai bhim | చిన‌త‌ల్లి పాత్ర‌లో న‌టించిన లిజోమోల్ ఎవ‌రు? ఆమెకు ఎలా అవ‌కాశం వ‌చ్చింది?

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement