సోమవారం 01 మార్చి 2021
Zindagi - Feb 08, 2021 , 00:10:50

ద్రాక్ష దాచేస్తుంది

ద్రాక్ష దాచేస్తుంది

ఏ సీజన్‌లో దొరికే పండ్లు ఆ సీజన్‌లో తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. అలా ఇప్పుడు మార్కెట్లో విరివిగా దొరుకుతున్న పండ్లలో ద్రాక్ష ముందు వరుసలో ఉంటుంది. ద్రాక్ష పండ్లు తింటే సూర్యరశ్మిలోని అతినీల లోహిత   (యూవీ) కిరణాల వల్ల ఉత్పన్నం అయ్యే సమస్యలు తగ్గుతాయట. ఇదే విషయాన్ని అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ డెర్మటాలజీ పరిశోధకులు అధ్యయనం చేసి మరీ తేల్చి చెప్పారు. నిత్యం ద్రాక్ష పండ్లు తినేవారిలో ఎండకు చర్మం కమిలిపోకుండా ఉంటుందని కూడా  ఈ అధ్యయనంలో వెల్లడైంది. దీనికి కారణం ద్రాక్షలోని పాలీఫెనాల్స్‌ వంటి పదార్థాలే. సీజన్‌ ఉన్నన్ని రోజులూ ద్రాక్ష పండ్లు తినాలని, అలా చేస్తే యూవీ కిరణాల వల్ల కలిగే సమస్యలు 74.8 శాతం మేర తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు. ద్రాక్ష  మన డీఎన్‌ఏకి నష్టం వాటిల్లకుండా రక్షిస్తుంది. చర్మ క్యాన్సర్‌ను సైతం అడ్డుకుంటుందని తెలిపే అధ్యయనాలు కూడా ఉన్నాయి.  ఎండాకాలం డీహైడ్రేషన్‌ సమస్య నుంచీ బయటపడవచ్చు.

VIDEOS

తాజావార్తలు


logo