Hanuman Movie – Stalin | టాలీవుడ్ దర్శకుడు ప్రశాంత్‌వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘హనుమాన్’. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి వరల్డ్‌వైడ్‌గా రూ.250 కోట్లుకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక ఈ సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ వర్మ. అయితే హనుమాన్ సినిమాలో అందరిని బాగా కట్టిపడేసిన సీన్ హనుమంతుడి విగ్రహం. అంజనాద్రి కొండపై వెలిసిన ఈ విగ్రహం మూవీ మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. అయితే ఈ విగ్రహంపై దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఈ సినిమాలో హనుమంతుడి విగ్రహంను మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్ సినిమాలోని పోస్టర్ రిఫరెన్స్ తీసుకుని డిజైన్ చేశాం. చిరంజీవిని ఆ పోస్టర్లో చూడగానే ఏదో తెలియని గూస్ బంప్స్ వస్తుంటాయి. అందుకే ఆ పోస్టర్‌ను రిఫరెన్స్‌గా వాడుకున్నాం. ఫైనల్ అవుట్ సూపర్ వచ్చింది అని తెలిపాడు. దీంతో ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.