కరోనా వలన లేదంటే ఇతర ఆరోగ్య సమస్యలతో సినీ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది ప్రముఖులు కన్నుమూసిన విషయం తెలిసిందే. లెజండరీస్ మృతి చెందడంతో అభిమానులు విషాదంలో ఉన్నారు. తాజాగా సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రముఖ సినీ కళా దర్శకుడు అంగముత్తు షణ్ముఖం క్యాన్సర్ తో చెన్నైలో కన్నుమూయడంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు నెలకొన్నాయి.
కొద్ది రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రిలో షణ్ముఖం చికిత్స పొందుతూ కన్నుమూసిన ఆయనకు నేడు స్థానిక నుంగంబాక్కంలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంగముత్తు షణ్ముఖం తమిళంతో పాటు తెలుగులో అలాగే ఇతర భాషల్లో కూడా ప్రముఖ హీరోల చిత్రాలకు పనిచేశారు. షణ్ముఖం మృతికి తమిళ సినీ ప్రముఖులు, దక్షిణ భారత సినీ ప్రముఖులు తదితరులు సంతాపం తెలియజేశారు.