MI vs KKR | చెలరేగిన ముంబై బౌలర్లు.. 169 పరుగులకే కోల్‌కతా ఆలౌట్
MI vs KKR | సొంతగడ్డపై కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బౌలర్లు చెలరేగారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కోల్‌కతా బ్యాటర్లను కట్టడి చేశారు. వెంకటేశ్ అయ్యర్ (70), మనీశ్ పాండే (42) మినహా మిగతా బ్యాటర్లందరూ చేతులెత్తేశారు.
MI vs KKR | సొంతగడ్డపై కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై బౌలర్లు చెలరేగారు. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కోల్‌కతా బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో వెంకటేశ్ అయ్యర్ (70), మనీశ్ పాండే (42) మినహా మిగతా బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. అయినప్పటికీ ఇద్దరూ కలిసి జట్టుకు చెప్పుకోదగ్గ స్కోర్ అందించారు. కానీ ముంబై బౌలర్ల ధాటికి నిర్ణీత 20 ఓవర్లకు ఒక బంతి మిగిలి ఉండగానే 169 పరుగుల వద్ద కోల్‌కతా బ్యాటర్లు ఆలౌటయ్యారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాను ముంబై ఆరంభం నుంచే ఎక్కడికక్కడ కట్టడి చేసింది. దీంతో పవర్ ప్లే ముగిసేలోపే కోల్‌కతా నాలుగు వికెట్లను కోల్పోయింది. ఏడో ఓవర్లో ఐదో వికెట్‌ను కూడా కోల్పోయింది. కోల్‌కతా కష్టాల్లో కూరుకుపోతున్న టైమ్‌లో క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్, మనీశ్ పాండే ఆచితూచి ఆడటం మొదలుపెట్టారు. మెల్లమెల్లగా ముంబై బౌలర్లను ఎదుర్కొంటూనే భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లారు. కానీ హాఫ్ సెంచరీకి చేరువవుతున్న సమయంలో 17వ ఓవర్లో హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో మనీశ్ పాండే క్యాచ్ ఔటవ్వడంతో కోల్‌కతాకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. వచ్చీరాగానే సిక్స్‌తో బోణీ కొట్టిన ఆండ్రూ రస్సెల్ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు. రనౌట్ అయి పెవిలియన్‌కు చేరాడు. అప్పట్నుంచి ముంబై బౌలర్లు ధాటిగా బౌలింగ్ చేయడంతో కోల్‌కతా వరుస వికెట్లను చేజార్చుకుంటూ ఆలౌటయ్యింది.
తుషారా వేసిన తొలి ఓవర్లో నాలుగో బంతికి ఫిలిప్ సాల్ట్ (5) తిలక్‌వర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మూడో ఓవర్లో రెండో బంతికి రఘువంశీ (13) కూడా క్యాచ్ ఔటవ్వగా.. చివరి బంతికి శ్రేయస్ అయ్యర్ (6) కూడా ఔటయ్యాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఐదో ఓవర్లో రెండో బంతికి నరైన్ (8) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఏడో ఓవర్లో తొలి బంతికే రింకు (9) పీయూష్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. టాపార్డర్ విఫలమైన వేళ క్రీజులోకి వచ్చిన వెంకటేశ్ అయ్యర్ (70), మనీశ్ పాండే (42) విజృంభించారు. వీళ్లిద్దరూ కలిసి జట్టుకు కీలక స్కోర్‌ను అందించారు. కానీ 17వ ఓవర్లో కోల్‌కతాకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో రెండు వికెట్లను కోల్‌కతా కోల్పోయింది. మూడో బంతికి మనీశ్ పాండే బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చాడు. చివరి బంతికి పరుగు తీసే క్రమంలో రసెల్ (7) రనౌట్ అయ్యాడు. బుమ్రా వేసిన 18వ ఓవర్లోనూ రెండు వికెట్లు పడ్డాయి. ఈ ఓవర్లో నాలుగో బంతికి రమణ్‌దీప్ (2) క్యాచ్ ఔటవ్వగా.. స్టార్క్ (0) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక 19.5 ఓవర్ల వద్ద వెంకటేశ్ అయ్యర్ కూడా ఔటయ్యాడు. దీంతో ఆలౌట్ అయ్యేసరికి కోల్‌కతా 169 పరుగులు చేసింది. ముంబైకి 170 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jamia Millia Islamia | 14వ రోజుకు జామియా విద్యార్థుల నిరాహార దీక్ష.. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్
Health Tips | మందులో కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్టే..!
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

