నటుడు ఆర్ నారాయణమూర్తి అరెస్ట్..!
అనడానికి కూడా కాస్త విచిత్రంగా ఉంది కదా..తన సినిమాలు తను చేసుకుంటూ తన బ్రతుకు తాను బతికే ఆర్.నారాయణమూర్తిని పోలీసులు అరెస్టు చేయడం ఏంటి అంటూ షాక్ అవుతున్నారు కదా..!

అనడానికి కూడా కాస్త విచిత్రంగా ఉంది కదా..తన సినిమాలు తను చేసుకుంటూ తన బ్రతుకు తాను బతికే ఆర్.నారాయణమూర్తిని పోలీసులు అరెస్టు చేయడం ఏంటి అంటూ షాక్ అవుతున్నారు కదా..! ఉద్యమ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ నటుడిని ఇప్పుడు హైదరాబాదు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీని వెనక ఒక కారణం ఉంది. ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరం గానే ఉన్నాడు ఆర్ నారాయణ మూర్తి. అయితే సినిమాలకు దూరంగా ఉన్నా ప్రజా సమస్యలకు మాత్రం ఎప్పుడూ దగ్గరగానే ఉంటాడు.
ఎక్కడ అన్యాయం జరిగినా వెంటనే తన గళం విప్పుతాడు. ఇప్పుడు కూడా అదే చేశాడు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నారు. వాటిని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే చాలా రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు రోడ్ల మీద నినాదాలు చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఛలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టారు. అందులో ఎంతోమంది రైతులు పాల్గొన్నారు. వాళ్లకు తోడుగా మూర్తన్న కూడా తన కాళ్ళు కదిపారు.
అయితే అక్కడికి వచ్చిన పోలీసులు ఆందోళనకారులను వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని హెచ్చరించారు. పోలీసుల మాటలు వినిపించుకోకుండా రాజ్ భవన్ ను ముట్టడించడానికి కొందరు ఆందోళనకారులు ప్రయత్నించారు. దాంతో వారిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అందులోనే ఆర్.నారాయణమూర్తి కూడా ఉండటం గమనార్హం. ఈ చట్టం ద్వారా రైతులు నష్టపోతున్నారని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు నారాయణ మూర్తి.
2006లో బీహార్ లో కూడా ఇలాంటి చట్టం తీసుకొచ్చారు. దాంతో అప్పుడు వాళ్లు ఎంతో నష్టపోయారు. అప్పటి రైతులు ఇప్పుడు కూలీలుగా మిగిలిపోయారు. ఈ సారి అలాంటి దుస్థితి రాకుండా ఉండాలంటే వెంటనే ఈ చట్టం వెనక్కి తీసుకోవాలి అంటూ ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం నారాయణమూర్తి అరెస్టు విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇవి కూడా చదవండి..
సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. కళా దర్శకుడు మృతి
అభిమానులు ఇంటికి రావడం నాకు నచ్చదు: రష్మిక
ఫాలోవర్లు, ఫ్యాన్స్ కు కొరటాల శివ షాక్
‘మా’ ఎన్నికలు..ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు వీళ్లే
సెట్లో సన్నీలియోన్ రిలాక్సింగ్ మూడ్..వీడియో
‘పెళ్లికి ముందే శృంగారం’పై అనురాగ్‌కు కూతురి ప్రశ్న..వీడియో వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ప్రభుత్వ ధాన్యానికి ఎగనామం.. రూ.12 కోట్ల సీఎంఆర్ బియ్యం గల్లంతు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్య ట్రాన్స్ఫర్ చేస్తా అని బెదిరించారు.. వేధింపులపై మహిళా ప్రొఫెసర్.. వీడియో
BRS Leaders | ప్రజా ఉద్యమాలను కేసులతో ఆపలేరు : బీఆర్ఎస్ నాయకులు
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

