‘చితి’ కష్టం.. చూడలేక..

- కుంటకట్ట, వాగు పక్కనే దహన సంస్కారాలు చూసి చలించా..
- ఆఖరి మజిలీ హాయిగా ఉండాలని భావించా..
- అర ఎకరం భూమి వైకుంఠధామానికి దానం
- చెరో 10 గుటలు ఇచ్చిన అన్నదమ్ములు
- స్థల దాతలు సాదునేని భాస్కర్‌రావు, పన్నగేశ్వరావు
యాదాద్రి ఆలయ పునర్నిర్మాణంతో ఆ ప్రాంత భూములకు రెక్కలొచ్చాయి. ఆలయ పరిసరాల్లో గుంట భూమీ విలువైనదే. గుంట భూమి కోసం కుటుంబసభ్యులనే దూరం చేసుకున్నవారూ ఉన్నారు. కానీ ఆ అన్నదమ్ములు.. ఊరి కోసం ముందుకొచ్చారు. తమ ఊరిలో ప్రజలు పడుతున్న ‘చితి’ కష్టాలు చూడలేక.. ఆఖరి మజిలీ హాయిగా ఉండాలని అర ఎకరం భూమి ఇచ్చారు. యాదగిరిగుట్ట పురపాలక సంఘం పేరిట ఈ నెల 10వ తేదీన చెరో 10 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేశారు. యాదగిరిగుట్ట పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్థలదాతలు సాదునేని భాస్కర్‌రావు, పన్నగేశ్వరరావును ఘనంగా సన్మానించగా, వార్డు కౌన్సెలర్ అనిల్ స్మశానవాటిక నిర్మాణానికి ఆదివారం భూమిని చదును చేసే పనిని ప్రారంభించారు.
- కుంటకట్ట, వాగు పక్కనే దహన సంస్కారాలు
- చూసి చలించా, ఆఖరి మజిలీ హాయిగా ఉండాలని భావించా
- వైకుంఠధామానికి 20 గుంటల భూమి దానం: దాత సాదునేని భాస్కర్‌రావు
యాదాద్రి, ఫిబ్రవరి 14: యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణంతో అక్కడి ప్రాంత భూములకు రెక్కలొచ్చాయి. గతంలో ఎకరానికి రూ. 50 వేలు ఉన్న భూమి విలువ ఇప్పుడు కోట్లకు చేరింది. గుంట భూమికోసమే తమ కుటుంబ సభ్యులనే దూరం చేసుకుంటున్నారు. ప్రాణాలకు తెగించి భూ కబ్జాకు పాల్పడుతున్న ఈ తరుణంలో ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు తమకు ఉన్న రూ. 50 లక్షల విలువగల భూమిని వైకుంఠధామం నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఇంత గొప్ప మనస్సు ఉన్న దాత సాదునేని భాస్కర్‌రావు చెప్పిన మాటలు.. నా బాల్యం మొత్తం యాదగిరిగుట్ట పట్టణంలోని పెద్దిరెడ్డిగూడెంలో కొనసాగింది. ఇక్కడే నా చదువుపూర్తయ్యింది. అప్పట్లో మా స్కూల్ యాదగిరిగుట్ట కొండపైన ఉండేది. చదువు పూర్తయిన అనంతరం ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఉద్యోగం వచ్చింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విధులు నిర్వర్తించా. గత మూడేండ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందాను. ప్రస్తుతం సొంత ఊరైన పెద్దిరెడ్డిగూడెంలో ఉంటున్నాను. మా గ్రామం, పాతగుట్ట ప్రాంతాల్లో చనిపోయినవారి అంతిమ సంస్కారాలు గ్రామ శివారులోని కుంటకట్ట, వాగు, రోడ్డు పక్కనే చేస్తున్నారు. మనిషి జీవించి ఉన్నప్పుడు నిత్యం జీవనపోరాటాన్ని సాగించి, చనిపోయిన తర్వాత ఆయన అఖరిఘట్టం ఇంత ఘోరంగా ఉంటుందా అని బాధపడ్డాను. మా గ్రామంలో వైకుంఠధామం లేదని స్థానిక కౌన్సిలర్ దండెబోయిన అనిల్ ద్వారా తెలుసుకున్నాను. ఆఖరి మజిలీ హాయిగా ఉండాలని భావించాను. వెంటనే యాదాద్రి దేవస్థానంలో ఉద్యోగిగా ఉండి గతేడాది ఉద్యోగ విరమణ పొందిన మా సోదరుడు సాధునేని పన్నగేశ్వరరావుతో మాట్లాడా. పెద్దిరెడ్డిగూడెంలోని సర్వే నంబర్ 207లో మా సోదరుడు పన్నగేశ్వరరావు 10 గుంటలతో పాటు నా సొంత భూమి 10 గుంట లు మొత్తం 20 గుంటలను వైకుంఠధామం నిర్మించాలని యాదగిరిగుట్ట పురపాలక సంఘం పేరిట ఈ నెల 10వ తేదీన రిజిస్ట్రేషన్ చేశా. చిన్నవాడైన మా వార్డు కౌన్సిలర్ అనిల్ వైకుంఠధామం నిర్మాణానికి ఎంతో కృషి చేస్తున్నాడు.
సార్లకు ధన్యవాదాలు
సొంత ఊరికి చిరస్థాయిగా నిలిచిపోవాలన్న ఉద్దేశంతో డబ్బులను సైతం లెక్కచేయకుండా రూ.50 లక్షల విలువగల భూమిని పురపాలక సంఘం పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. ఆ భూమిలో సకల వసతులతో వైకుంఠధామం నిర్మిస్తాం. దాతలు సాదునేని భాస్కర్‌రావు, పన్నగేశ్వరరావులకు ప్రత్యేక ధన్యవాదాలు. పెద్దిరెడ్డిగూడెంతో పాటు పాతగుట్ట ప్రజలకు త్వరలో వైకుంఠధామం అందుబాటులోకి తీసుకువస్తాం.
-దండెబోయిన అనిల్, 9వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్
తాజావార్తలు
- అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
- ఏంటి పవన్‌కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!
- ధోనీ సమావేశంలో తోపులాట, పోలీసుల లాఠీచార్జీ
- పాప చక్కగా పాలు తాగేందుకు.. ఓ తండ్రి కొత్త టెక్నిక్
- ఎన్‌పీఎస్‌లో పాక్షిక విత్‌డ్రాయల్స్ కోసం ఏం చేయాలంటే..?!
- జనగామ జిల్లాలో బాలిక అదృశ్యం
- టీఆర్ఎస్, బీజేపీ పాలనలోని వ్యత్యాసాలను వివరించండి
- రానా 'అరణ్య' ట్రైలర్ వచ్చేసింది
- అవినీతి ఆరోపణలు.. గుడిపల్లి ఎస్ఐపై సస్పెన్షన్ వేటు
- రాజేంద్రప్రసాద్ డబ్బింగ్ వీడియో వైరల్