ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి?
ప్రస్తుతం నేను బీఎస్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా. ఇంటర్ వరకూ బాగా చదివేదాన్ని. డిగ్రీలో చేరాకే నా పర్ఫార్మెన్స్ తగ్గడం మొదలైంది. చదువుపై పూర్తిగా శ్రద్ధ పెట్టలేకపోతున్నాను. ప్రతి చిన్నదానికీ భయపడుతున్నాను. తరచూ తలనొప్పితో ఇబ్బంది పడుతున్నాను. ఇంట్లోవాళ్లపై కూడా చిరాకు పడుతున్నాను. వీటన్నిటినీ ఎలా అధిగమించాలి?

ఓ సోదరి
జ : ఏకాగ్రత, శ్రద్ధ లేకుండా చదివే చదువు
‘అడుగున రంధ్రం ఉన్న బకెట్లో నీళ్లు నింపడం’ లాంటిదే. ప్రయోజనం ఉండదు. ఏకాగ్రత లేకపోవడానికి మానసిక, శారీరక సమస్యలు కారణం కావచ్చు. ఇంకొంతమందికి ఎక్కువ సమయం ఒకే విషయం మీద ఫోకస్ చేసినా ఏకాగ్రత లోపిస్తుంది. నిద్రలేమి, ఇన్ఫెక్షన్లు, డిప్రెషన్ మొదలైన ఆరోగ్య సమస్యలు కూడా కారణాలు కావచ్చు.
ఏకాగ్రత పెరగాలంటే..
చదువుకునేందుకు మంచి వాతావరణాన్ని సృష్టించుకోవాలి. టీవీ, ఫోన్, కంప్యూటర్, మ్యూజిక్ ప్లేయర్‌కి దూరంగా ఉండాలి.
స్పష్టమైన లక్ష్యాన్ని పెట్టుకోవాలి. విద్యకు ఒక అర్థం, పరమార్థం ఉండాలి.
ఏ పనికి ఎంత సమయం కేటాయించాలో పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. మల్టీ టాస్కింగ్ ఎప్పుడూ చేయకూడదు.
స్టడీ సెషన్స్‌కు నలభైనుంచి యాభై నిమిషాలకంటే ఎక్కువ సమయం కేటాయించొద్దు. అలసిపోకుండా ఉండేందుకు మధ్యమధ్యలో విరామం అవసరం.
మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. బాధలను, ఆందోళనలను మర్చిపోవాలి.
చదువుతున్నప్పుడు ముఖ్యమైన పాయింట్స్‌ను, టాపిక్స్‌ను పుస్తకంలో నోట్ చేసుకోవాలి. అవసరమైనప్పుడు వాటిని రిఫర్ చేసుకోవాలి.
యోగా, ధ్యానం మొదలైన టెక్నిక్స్ ఉపయోగపడతాయి.
ఎస్క్యూ3ఆర్ పద్ధతి:
ఎస్ (సర్వే): చదివిన దాంట్లో ముఖ్యమైనవి ఒక సర్వే పుస్తకంలో రాసుకోవాలి. టైటిల్స్, సబ్-టైటిల్స్, క్యాప్షన్స్ లాంటివి రిఫరెన్స్‌కి బాగా తోడ్పడతాయి.
క్యూ (క్వశ్చన్): పుస్తకంలో నోట్ చేసుకోవడం, చదవడం పూర్తయ్యాక క్వశ్చన్స్ వేసుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఆర్ 1 (రీడ్): చాప్టర్ పూర్తవగానే క్వశ్చన్, దానికి సరైన జవాబును తెలుసుకొని చదువుకోవాలి. అలా చదివితే మర్చిపోవడం అంటూ జరగదు.
ఆర్ 2 (రీసైట్): చదివిన వాటిని తిరిగి ప్రశ్నించుకుంటూ వాటి జవాబులను గుర్తు చేసుకోవాలి. సొంతంగా జవాబులను తయారు చేసుకోవాలి. అవసరమైతే ముందు రాసుకున్న నోట్స్ తీసి చూడాలి.
ఆర్ 3 (రివ్యూ): చదివిన తర్వాత అవన్నీ మెదడులో తాజాగా ఉండాలంటే మళ్లీమళ్లీ చదవాలి.
రాధిక నల్లన్ ఆచార్య
క్లినికల్ సైకాలజిస్ట్
Read Today's Latest Health News in Telugu and Telugu News
- Tags
- concentration
- Study
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

