e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, July 28, 2021
Home News Monsoon Diseases: వ‌ర్షాకాలంలో ఈ వ్యాధుల‌తో ముప్పు.. జ‌ర పైలం

Monsoon Diseases: వ‌ర్షాకాలంలో ఈ వ్యాధుల‌తో ముప్పు.. జ‌ర పైలం

Monsoon Diseases: వ‌ర్షాకాలంలో ఈ వ్యాధుల‌తో ముప్పు.. జ‌ర పైలం

Monsoon Diseases: కొద్దిరోజులుగా వాతావ‌ర‌ణం మారిపోయింది. రాష్ట్ర‌వ్యాప్తంగా అక్క‌డ‌క్క‌డ మోస్త‌రు నుంచి భారీ వాన‌లు కురుస్తున్నాయి. ఇలా సీజ‌న్ మారిన‌ప్పుడు సాధార‌ణంగా ర‌క‌ర‌కాల ఇన్‌ఫెక్ష‌న్లు దాడి చేస్తుంటాయి. ముఖ్యంగా వ‌ర్షాకాలంలో జ‌లుబు, వైర‌ల్ ఫీవ‌ర్లు, ఇత‌ర‌త్రా అంటువ్యాధులు వ్యాపించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. కాబ‌ట్టి ఈ క‌రోనా స‌మ‌యంలో అప్ర‌మ‌త్తంగా ఉండ‌టం చాలా అవ‌స‌రం. ఎందుకంటే వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్లు, క‌రోనా ల‌క్ష‌ణాలు దాదాపుగా ఒకే త‌ర‌హాలో ఉన్న నేప‌థ్యంలో జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది. అయితే త‌గిన జాగ్ర‌త్త‌లు పాటిస్తే వైర‌ల్ ఇన్‌ఫెక్ష‌న్ల బారిన ప‌డ‌కుండా ఉండొచ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు

Monsoon Diseases: వ‌ర్షాకాలంలో ఈ వ్యాధుల‌తో ముప్పు.. జ‌ర పైలం

ఏ వ్యాధులు వ‌స్తాయి

వైరల్‌ జ్వరాలు అకస్మాత్తుగా సోకుతాయి. తీవ్ర‌త‌ ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి 102 డిగీల జ్వరం ఉంటుంది. తీవమైన తలనొప్పి, ఒళ్లు నొప్పుల మధ్య రోగి నిస్సత్తువగా మారిపోతారు. కొందరిలో ఒంటి దద్దుర్లు, వాంతులు, అరుదుగా విరేచనాలూ కనిపిస్తాయి. మరికొందరిలో జలుబు వంటి లక్షణాలేవీ లేకుండానే జ్వరాలు వేధిస్తుంటాయి. సాధారణంగా వీటిని విష జ్వరాలు అంటారు. వాటంతట అవే తగ్గిపోయే సాధారణ వైరల్‌ జ్వరాలు కూడా కొన్ని ఉన్నాయి. తప్పనిసరిగా చికిత్స తీసుకోవాల్సిన మలేరియా, డెంగీ, చికున్‌ గున్యా వంటివీ వైరల్‌ ఫీవర్‌ కిందకే వస్తాయి. క‌ల‌రా, హెప‌టైటిస్ ఎ కూడా ఈ వ‌ర్షాకాలంలో వ‌చ్చే అవ‌కాశం ఉంది

Monsoon Diseases: వ‌ర్షాకాలంలో ఈ వ్యాధుల‌తో ముప్పు.. జ‌ర పైలం

లక్షణాలు

- Advertisement -

ఒళ్లు నొప్పులు, జ్వరం, నీరసం, ఒంటి దద్దుర్లు, వికారం, తలనొప్పి, ఆకలి మందగించడం, గొంతునొప్పి, ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. లక్షణాల తీవ్ర‌త తగ్గడానికి వ్యాధి నుంచి ఉపశమనం కలుగడానికి మాత్ర‌మే మందులు ఉపకరిస్తాయి.

Monsoon Diseases: వ‌ర్షాకాలంలో ఈ వ్యాధుల‌తో ముప్పు.. జ‌ర పైలం

ప్ర‌భావం

శరీరంలోని కణాల మీద వైరస్‌ దాడి చేస్తుంది. ముఖ్యంగా శ్వాస వ్యవస్థ మీద ప్ర‌భావం చూపుతుంది. వైరస్‌ చాలా పవర్‌ ఫుల్‌గా ఉంటే నరాల మీద దాడి చేస్తుంది. దీంతో వివిధ రకాలుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. రోగి బలహీనంగా మారి ఆహారం పూర్తిగా తీసుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది.

Monsoon Diseases: వ‌ర్షాకాలంలో ఈ వ్యాధుల‌తో ముప్పు.. జ‌ర పైలం

ప్ర‌థమ చికిత్స

వైరల్‌ ఫీవర్‌కు సంబంధించిన లక్షణాలల్లో క‌నీసం రెండు, మూడు కనిపిస్తే రోగికి ఎక్కువగా నీళ్లు తాగించాలి. దీంతో శరీరం డీహైడ్రేష‌న్‌కు గురికాకుండా ఉంటుంది. రోగికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి. తేలికపాటి ఆహారం ఇవ్వాలి. ముఖ్యంగా రోగి ఆందోళనకు గురికాకుండా చూసుకోవాలి. తాజా కొత్తిమీరతో చేసిన టీ, మెంతి వాటర్‌ తాగించాలి. దీంతో వైరస్‌ నాశనం అవుతుంది. పెద్దవాళ్లకైతే గంజి తాగించడం మంచి పద్ధతి. ఇది వైరస్‌ను ఎక్కువ కాలం బతకనివ్వదు.

Monsoon Diseases: వ‌ర్షాకాలంలో ఈ వ్యాధుల‌తో ముప్పు.. జ‌ర పైలం

రావడానికి కారణం

వైరల్‌ ఫీవర్‌ గాలి ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. కొన్నిసార్లు శ్వాస నాళాల ద్వారా కూడా వ్యాపిస్తుంది. కలుషిత నీరు, ఆహారం తీసుకున్నప్పుడు కూడా వైరల్‌ ఫీవర్స్‌ విజృంభిస్తాయి. చల్లదనం తీవ్ర‌త పెరగడంతో రక్త నాళాలు కుచించుకుపోతాయి. దీంతో రక్త సరఫరా నెమ్మదిస్తుంది. రక్తంలో ఉండే తెల్లరక్త కణాలు సంఖ్య కమంగా తగ్గడంతో శరరీంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ ఇన్‌ఫెక్షన్లు, జ్వరాలు పిల్లల్లో చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి.

Monsoon Diseases: వ‌ర్షాకాలంలో ఈ వ్యాధుల‌తో ముప్పు.. జ‌ర పైలం

తీసుకోవాల్సిన జాగత్తలు

  • వైరల్‌ ఫీవర్‌ ఇన్‌ఫెక్షన్‌ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది.
  • ఆహారం షేర్‌ చేసుకోవద్దు.
  • చల్లదనం బారినపడకుండా జాగత్తలు తీసుకోవాలి.
  • వానలో వెళ్తే గొడుగు, రెయిన్‌ కోట్స్‌ తప్పనిసరిగా వాడాలి.
  • కాచి, చల్లార్చిన నీటిని తాగాలి.
  • ఇంటి పరిసరాల్లో నీరు నిల్వకుండా చూసుకోవాలి.
  • పిల్లలకు పండ్లు ఎక్కువగా తినిపించాలి. నూనె పదార్థాలు వాడొద్దు.
  • వానలో తడిసినప్పుడు జలుబు, గొంతునొప్పి లాంటివి వస్తే వెంటనే డాక్టర్‌ను సంప్ర‌దించాలి.
Monsoon Diseases: వ‌ర్షాకాలంలో ఈ వ్యాధుల‌తో ముప్పు.. జ‌ర పైలం

వ‌ర్షాకాలంలో ఇమ్యూనిటీని పెంచుకునేందుకు కొన్ని వంటింటి చిట్కాలు

తమలపాకు రసం: కాలేయ‌, ఊపిరితిత్తులు, శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లు ఉన్నవారు త‌మ‌ల‌పాకు ర‌సం తీసుకోవ‌డం వ‌ల్ల ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. త‌మ‌ల‌పాకు ఆకుల‌ను జ్యూస్‌లా చేసుకొని ఆ రసానికి తేనె, నిమ్మ‌ర‌సం లేదా ఉప్పు క‌లిపి ప‌రిగ‌డుపున తీసుకుంటే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నం పొంద‌వ‌చ్చు.

వెల్లుల్లి మజ్జిగ: ఇమ్యూనిటీ పెంచ‌డంలో వెల్లుల్లి ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. అలాగే కొలెస్ట్రాల్‌, శ్వాస స‌మ‌స్య‌లు, గుర‌క‌, ర‌క్త‌స‌ర‌ఫ‌రా సంబంధిత స‌మ‌స్య‌లను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. కాబ‌ట్టి ఈ వర్షాకాలంలో రెండు వెల్లుల్లి రెబ్బ‌ల‌ను మెత్త‌గా నూరి, ఒక గ్లాస్ మ‌జ్జిగ‌లో క‌లిపి ప‌రిగ‌డుపున తీసుకుంటే మంచిది.

Monsoon Diseases: వ‌ర్షాకాలంలో ఈ వ్యాధుల‌తో ముప్పు.. జ‌ర పైలం

వేడినీళ్లు: వ‌ర్షాకాలంలో నీటిని శుద్ధి చేసుకుని లేదా వేడి చేసుకుని తాగ‌డం మంచిది. పరగడుపున వేడి నీళ్లు తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగై, విరోచనం సాఫీగా జరుగుతుంది. పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధికి ప్రొబయాటిక్స్‌ తోడ్పడతాయి.
ఆవ‌పిండి: ఆవ‌పిండితో చేసిన వంట‌కాలు తిన‌డం వ‌ల్ల అంటువ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది. ఆవ‌పిండితో చేసిన ఆవ‌కాయ ప‌చ్చ‌డి, మ‌జ్జిగ చారు వంటివి ఈ వ‌ర్షాకాలంలో త‌ర‌చూ తిన‌డం మంచిది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

Monsoon Diet : వ‌ర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలా? వీటిని ఆహారంగా తీసుకోండి

స్నానానికి ఏ నీళ్లు మంచివి?

వెల్లుల్లితో లైంగిక సమస్యలు దూరమవుతాయా..?

రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? తింటే ఏమౌతుంది

Monsoon Diseases: వ‌ర్షాకాలంలో ఈ వ్యాధుల‌తో ముప్పు.. జ‌ర పైలం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
Monsoon Diseases: వ‌ర్షాకాలంలో ఈ వ్యాధుల‌తో ముప్పు.. జ‌ర పైలం
Monsoon Diseases: వ‌ర్షాకాలంలో ఈ వ్యాధుల‌తో ముప్పు.. జ‌ర పైలం
Monsoon Diseases: వ‌ర్షాకాలంలో ఈ వ్యాధుల‌తో ముప్పు.. జ‌ర పైలం

ట్రెండింగ్‌

Advertisement