GT vs RCB : ఐపీఎల్ 19 ఫైనల్లో ఆర్సీబీ పేసర్ల ధాటికి గుజరాత్ టైటాన్స్ టాపార్డర్ కుప్పకూలింది. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్(10), సాయి సుదర్శన్‌ల(12)లు పవర్ ప్లేలోనే పెవిలియన్ చేరారు. ప్రధాన ఆటగాళ్లు తేలిపోవడంతో పెద్ద ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకోవాలనుకున్న జోస్ బట్లర్(19)ను జితేశ్ శర్మ స్టంపౌట్ చేయడంతో నాలుగో వికెట్ కోల్పోయింది గుజరాత్.
సొంతమైదానంలో ఫైనల్.. దంచేయాలనుకున్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్లకు ఆర్సీబీ పేసర్లు షాకిచ్చారు. జాకబ్ డఫ్ఫీ() వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో వరసగా రెండు ఫోర్లు బాదిన సాయి సుదర్శన్(12)ను అంపైర్ ఔటిచ్చాడు. వెంటనే రివ్యూ కోరిన అతడు బంతి బ్యాట్‌కు తగలకపోవడంతో బతికిపోయాడు. క్వాలిఫయర్ 2లో శతకంతో మెరిసిన శుభ్‌మన్ గిల్(10)ను హేజిల్‌వుడ్ బోల్తా కొట్టించాడు. తొలి బంతికి బౌండరీ బాదిన గిల్.. రెండో బంతిని షాట్ ఆడాలనుకున్నా టైమింగ్ కుదరక గాల్లోకి లేవగా ఆర్సీబీ కెప్టెన్ పటిదార్ పరుగెత్తుతూ వచ్చి అందుకున్నాడు. దాంతో, 22 వద్ద గుజరాత్ తొలి వికెట్ పడింది.
The Man of Finals doing what he does best! 🫡
Krunal Pandya outsmarts Jos Buttler and #RCB are roaring 🔥
Updates ▶️ https://t.co/Yz6K3q6w0X#TATAIPL | #Final | #TheFinalLeap | #RCBvGT pic.twitter.com/L3UkTRyhBg
— IndianPremierLeague (@IPL) May 31, 2026
ఆ తర్వాతి ఓవర్లోనే సుదర్శన్‌ను షార్ట్ పిచ్ బంతితో ఔట్ చేసిన భువి గుజరాత్‌ను గట్టిదెబ్బ కొట్టాడు. రసిక్ దార్ సలాం ఓవర్లో పడిక్కల్ బౌండరీ క్యాచ్‌తో నిషాంత్ సింధు() వెనుదిరిగాడు. టాపార్డర్ విఫలమైన వేళ జోస్ బట్లర్(19), వాషింగ్టన్ సుందర్(19 నాటౌట్)లు గుజరాత్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే బాధ్యత తీసుకున్నారు. డఫ్పీ బౌలింగ్‌లో సుందర్ గాల్లోకి లేపిన బంతిని కాక్స్ డైవ్ చేస్తూ అందుకున్నాడు. కానీ, చేతి వేళ్ల మధ్యలోంచి బంతి నేలకు తాకడంతో అంపైర్ నాటౌటిచ్చాడు. దాంతో, గుజరాత్ ఊపిరిపీల్చుకుంది. కానీ, కృనాల్ పాండ్య ఓవర్లో ముందుకొచ్చి ఆడిన బట్లర్ స్టంపౌటయ్యాడు. ఫలితంగా గుజరాత్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 14 ఓవర్లకు స్కోర్ .. 99–4.