Ramayana | రామాయణ బాక్సాఫీస్ విధ్వంసం.. 10వ రోజు కూడా తగ్గని జోరు, ప్రపంచవ్యాప్తంగా రూ.1,228 కోట్ల వసూళ్లు!
Ramayana | భారతీయ సినీ చరిత్రలో మరో భారీ బాక్సాఫీస్ సంచలనంగా ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ నిలుస్తోంది. నితీశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది.
Ramayana | భారతీయ సినీ చరిత్రలో మరో భారీ బాక్సాఫీస్ సంచలనంగా ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఎ లెజెండ్’ నిలుస్తోంది. నితీశ్ తివారీ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్లలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నవంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా తొలి రోజు నుంచే భారీ వసూళ్లతో దూసుకెళ్తోంది. ముఖ్యంగా రెండో వారంలోకి అడుగుపెట్టిన తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోరును కొనసాగించడం విశేషం. తాజాగా 10వ రోజు టికెట్ బుకింగ్స్, కలెక్షన్లు చూస్తుంటే ఈ సినిమా ప్రభంజనం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.
సాధారణంగా పెద్ద సినిమాలకు మొదటి వారం తర్వాత టికెట్ బుకింగ్స్ క్రమంగా తగ్గుతుంటాయి. కానీ ‘రామాయణ’ విషయంలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది. రెండో శనివారం అయిన 10వ రోజు కూడా ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్లకు క్యూ కట్టారు. ప్రముఖ టికెట్ బుకింగ్ వేదిక బుక్‌మైషోలో ఒక్క శనివారం రోజే 10.1 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. అంటే 1.01 మిలియన్ టికెట్లను ప్రేక్షకులు బుక్ చేసుకున్నారు. ఈ సినిమా తొలి రోజు కూడా బుక్‌మైషోలో 10.2 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. ఇప్పుడు విడుదలైన పదో రోజున కూడా దాదాపు అదే స్థాయిలో టికెట్లు అమ్ముడవడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ తాజా అమ్మకాలతో బుక్‌మైషోలో సినిమా మొత్తం టికెట్ విక్రయాలు 1.20 కోట్ల మార్కును దాటాయి. రెండో వారంలోనూ ఇంతటి భారీ స్పందన రావడం సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తికి నిదర్శనంగా నిలుస్తోంది.
టికెట్ అమ్మకాలతో పాటు కలెక్షన్లలోనూ ‘రామాయణ’ అదరగొడుతోంది. తొమ్మిదో రోజు అంటే శుక్రవారం ఇండియాలో రూ.48.10 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, పదో రోజు ఏకంగా 51.6 శాతం వృద్ధిని నమోదు చేసింది. శనివారం ఒక్కరోజే రూ.72.90 కోట్ల నెట్ కలెక్షన్లను రాబట్టింది. భాషల వారీగా చూస్తే హిందీ వెర్షన్ అత్యధికంగా రూ.53.75 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. కన్నడలో రూ.5.40 కోట్లు, తమిళంలో రూ.4.75 కోట్లు, మలయాళంలో రూ.4.75 కోట్లు, తెలుగులో రూ.4.25 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. అన్ని భాషల్లోనూ సినిమా మంచి ప్రదర్శన కొనసాగిస్తుండటంతో రెండో వారాంతంలో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సినిమా మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే ‘రామాయణ’ ఇప్పటికే భారీ రికార్డులను సొంతం చేసుకుంది. విడుదలైన కేవలం పది రోజుల్లోనే ఇండియాలో రూ.685.60 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. గ్రాస్ పరంగా దేశీయ మార్కెట్లో రూ.819.50 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ సినిమాకు అద్భుతమైన స్పందన లభిస్తోంది. విదేశాల్లో ఇప్పటివరకు రూ.408.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. దీంతో ఇండియా, ఓవర్సీస్ కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొత్తం వసూళ్లు రూ.1,228 కోట్లకు చేరాయి. కేవలం పది రోజుల్లోనే ఈ స్థాయి వసూళ్లు సాధించడం ఈ సినిమా బాక్సాఫీస్ సత్తాను చాటుతోంది.
రెండో శనివారం బుకింగ్స్, వసూళ్లలో భారీ పెరుగుదల నమోదు కావడంతో ఇప్పుడు అందరి దృష్టి రెండో ఆదివారం కలెక్షన్లపై పడింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బలంగా ఉండటంతో ఆదివారం వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జోరు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా మరిన్ని భారీ వసూళ్ల మైలురాళ్లను ఈ చిత్రం అందుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రామాయణ బాక్సాఫీస్ విధ్వంసం.. 10వ రోజు కూడా తగ్గని జోరు, ప్రపంచవ్యాప్తంగా రూ.1,228 కోట్ల వసూళ్లు!
Bhushan Bara | చదివిస్తానని ఇంటికి తెచ్చి కడుపు చేసిన ఎమ్మెల్యే.. జార్ఖండ్‌లో గిరిజన బాలికపై ఘాతుకం!
Promotions | ఏవో టు ఏడీ ఉద్యోగోన్నతుల్లో గోల్మాల్.. డీహెచ్‌లో ఇద్దరు ఏడీల దందా!
China | మళ్లీ హద్దు మీరిన చైనా.. భారత గగనతలంలోకి చైనా సైనిక విమానం.. సిక్కిం భూభాగంపై చక్కర్లు!
Bharat Summit | భారత్ సమ్మిట్ వేదికపై టెకీ నిరసన.. రాహుల్ ప్రసంగిస్తుండగా ఉద్యోగం నుంచి తొలగింపుపై ఆవేదన
ట్రెండింగ్ వార్తలు
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్

