రోజుకు ఎన్ని గుడ్లు తినాలి..? తింటే ఏమౌతుంది..?

హైదరాబాద్,జూన్ 29: వ్యక్తి రోజుకు ఎన్ని గుడ్లు తినాలనే విషయం తెలుసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రతి రోజు గుడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుందనే విషయం అందరికీ తెలుసు. అయితే రోజు ఎక్కువ గుడ్లు తినడం వల్ల ఏమైనా ప్రమాదం ఉందా..? అనే విషయం అందరూ తెలుసుకోవాలి.

గుడ్లు తినడంవల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అయితే ఎక్కువ గుడ్లు తినడం వల్ల మాత్రం ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినడం ఆరోగ్యానికి మంచిది.అయితే జిమ్లకు వెళ్లే వాళ్లు, శరీర దారుఢ్యాన్నిపెంచేవాళ్లు ఎక్కువ గుడ్లు తింటుంటారు.అలాంటి వాళ్లు రోజుకు 4నుంచి 5గుడ్లను కూడా తింటుంటారు. గుడ్డులోని తెల్ల సోన ఆరోగ్యానికి ఎంతో మంచిది. బరువు తగ్గాలనుకునే వాళ్లు దీన్ని తినడం ఉత్తమం.
గుడ్లు ఎక్కువగా తినడం వల్ల జీర్ణాశయంలో సమస్యలు వస్తాయి. అంతేకాదు ఎక్కువగా గుడ్లు తినడం వల్ల కిడ్నీలో సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉందట.గుడ్లు ఎక్కువగా తినడం వల్ల జీర్ణ ప్రక్రియ దెబ్బతింటుంది. దీన్ని పట్టించుకోకుంటే ఇబ్బందులు ఎక్కువవుతాయి.గుడ్డులో విటమిన్ ఏ,బి12,డి,ఈ,ఒమేగా3 వంటి పోషకాలులభిస్తాయి. అయితే రోజుకు రెండు గుడ్లు తింటే సరిపోతుందని వైద్యులు చెబుతున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
- Tags
- eggs
- Health
- Health news
- health tips
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

