రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం | రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో చోటు చేసుకున్నది ఖోఖర్ గ్రామ

చండీగఢ్ : రోడ్డు ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో చోటు చేసుకున్నది ఖోఖర్ గ్రామ శివారులో కారు, టిప్పర్ ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇందులో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కాగా.. మృతుల్లో నాలుగేళ్ల చిన్నారి, ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులను కలానౌర్‌కు చెందిన వారిగా గుర్తించారు. గుర్నమ్ సింగ్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి గురుదాస్‌పూర్‌లో ఉన్న వైద్యుడి వద్దకు స్నేహితుడు బిక్రమ్ మాసిహ్‌తో కలిసి కారులో బయలుదేరాడు. వైద్యుడిని కలిసి తిరిగి కలానౌర్ గ్రామానికి వెళ్తున్న సమయంలో ఖోఖర్ సమీపంలోని కేంబ్రిడ్జ్ స్కూల్ సమీపంలో ఎదురుగా ఉన్న వాహనాన్ని ఓవర్ టెక్ చేస్తున్న క్రమంలో కారు ఎదురుగా వస్తున్న మోపెడ్‌ను తప్పిస్తూ.. ముందు నుంచే వస్తున్న టిప్పర్‌ను ఢీకొట్టాడు. ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు మృత్యువాతపడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి?
Monsoon Diseases: వర్షాకాలంలో ఈ వ్యాధులతో ముప్పు.. జర పైలం
పుల్వామాలో ఎదురుకాల్పులు
ఇక రాత్రి 10.45 వరకు మెట్రో పరుగులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

