తెలంగాణకు నేడు, రేపు వర్ష సూచన
తెలంగాణకు నేడు, రేపు వర్ష సూచన | తెలంగాణలో శుక్ర, శనివారాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

హైదరాబాద్ : తెలంగాణలో శుక్ర, శనివారాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర కోస్తా ఏపీ పరిసర ప్రాం తాల్లో ఉపరితల ద్రోణి వ్యాపించి ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు కురిసే అవకాశం ఉందని చెప్పింది. పలుజిల్లాల్లో భారీ వర్షాలు కురిస్తాయని తెలిపింది. మరో వైపు రాష్ట్రంలో రుతుపవనాలు చురుకుగా ఉన్నాయి. దీని ప్రభావంతో జూలైలో సాధారణ వర్షం కానీ, అంతకంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
జూలై నుంచి సెప్టెంబర్ వరకు పసిఫిక్ మహాసముద్రంపై ప్రస్తుతం ఉన్న ఎల్నినో– సదరన్ అసిలేషన్ పరిస్థితులు అలాగే కొనసాగొచ్చని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా గురువారం రాత్రి హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాలో వర్షాలు కురిశాయి. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, వరంగల్ అర్బన్, రూరల్, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. పలు చోట్ల అక్కడక్కడ భారీ వర్షాపాతం నమోదైంది. పలు జిల్లాల్లో తేలిక పాటి జల్లులు కురిశాయి.
ఇవి కూడా చదవండి..
ఏకాగ్రతను ఎలా పెంచుకోవాలి?
Monsoon Diseases: వర్షాకాలంలో ఈ వ్యాధులతో ముప్పు.. జర పైలం
పుల్వామాలో ఎదురుకాల్పులు
ఇక రాత్రి 10.45 వరకు మెట్రో పరుగులు
రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

