రైతు వేదికలు దేశానికే ఆదర్శం

- అన్నదాతలకు అండగా తెలంగాణ ప్రభుత్వం
- రైతుల సంఘటితానికి సీఎం కేసీఆర్ నిర్ణయం
- రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి
భువనగిరి : రైతు వేదికల నిర్మాణాలతో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని చీమలకొండూరు గ్రామంలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశంలో మరెక్కడా జరగడంలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల పాలిట దేవుడని చెప్పారు. రైతులకు ఎలాంటి కష్టం వాటిల్లవద్దనే సదుద్దేశంతో ఎప్పటికప్పుడు సమగ్ర చర్యలు చేపట్టే ఏకైక ముఖ్యమంత్రి అని కొనియాడారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలోనూ రైతులు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేసిన ఘనత తెంగాణ రాష్ర్టానికే దక్కుతుందన్నారు. రైతుబంధు రూపంలో రూ. 7,500కోట్లను కరోనా కష్టకాలంలో అందజేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. రైతులను సంఘటితపరిచి రైతు వేదికలకు రూపకల్పన చేసిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. రైతాంగం పక్షాన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతఙ్ఞతలు తెలిపారు. అనంతరం మంత్రి కేటీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి, మొక్క నాటారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ డాక్టర్ జడల అమరేందర్‌గౌడ్, రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ కొలుపుల అమరేందర్, జడ్పీటీసీ సభ్యులు సుబ్బూరు బీరుమల్లయ్య, పీఏసీఎస్ చైర్మన్ నోముల పరమేశ్వర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ అబ్బగాని వెంకట్‌గౌడ్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ కంచి మల్లయ్య, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు ఎడ్ల రాజిరెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగాం పాండు, ప్రధాన కార్యదర్శి నీల ఓంప్రకాశ్‌గౌడ్, పీఏసీఎస్ మాజీ చైర్మన్ బల్గూరి మధుసూదన్‌రెడ్డి, సర్పంచ్ జీలుగు కవితసతీశ్పవన్, ఎంపీటీసీ సభ్యులు కంచి లలిత, సర్పంచ్‌లు అంకర్ల మురళీకృష్ణ, పోతుల కృష్ణ, చిందం మల్లికార్జున్, కాశపాక అరుణ, భువనగిరి శ్రీనివాస్, చిన్నం పాండు, ఎంపీటీసీ సభ్యులు సామల వెంకటేశ్, బొక్క కొండల్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు అతికం లక్ష్మీనారాయణగౌడ్, జక్క రాఘవేందర్‌రెడ్డి, సాలువేరు ఏసు, ముల్లె నాగేంద్రబాబు, విశ్వజిత్సింగ్, నల్లమాసు రాజు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కొట్లాటల కాంగ్రెస్ పట్టభద్రులకేం చేస్తుంది..
- కళ్లెదుటే అభివృద్ధి
- నేటి నుంచి చీదెళ్ల జాతర
- ఆ ఊరు.. ఓ ఉద్యానం
- సంత్ సేవాలాల్ త్యాగం చిరస్మరణీయం
- పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
- అరకొర పనులు..
- పకడ్బందీగా పట్టభద్రుల ఎన్నికలు
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్‌డ్రా
- అలాంటి పేరు తెచ్చుకుంటే చాలు!