ITI Admissions | హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 13 : హనుమకొండ- ములుగు రోడ్‌లోని హనుమకొండ- వరంగల్ ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్లలో మిగిలిన సీట్లకు 4వ దఫా(వాక్-ఇన్) భర్తీకి దరఖాస్తు చేసుకోవాలని కన్వీనర్, ప్రిన్సిపాల్ ఎం చందర్ తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి 1-8-2025 నాటికి 14 సంవత్సరాలు నిండినవారు దరఖాస్తు చేసుకోవచ్చని.. గరిష్ట వయోపరిమితి లేదని అన్నారు.
అభ్యర్థులు https://iti.telangana.gov.inలో ఈ నెల 30న మధ్యాహ్నం 1 గంటలలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇప్పటికే మూడు దశల్లో దరఖాస్తు చేసుకున్నవారు. మళ్లీ నమోదు చేసుకోవద్దని, సీటు లభించని, వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నవారు, అలాగే పూర్తి చేసుకోనివారు కూడా నేరుగా వాక్-ఇన్ అడ్మిషన్స్‌కి హాజరుకావచ్చన్నారు.
అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు (ఎస్ఎస్సీ, టీసీ, స్టడీ, కుల) ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులను ప్రతీ రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంటలలోపు సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కి హాజరుకావాలన్నారు. ప్రతిరోజు మెరిట్ జాబితా ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుందని, ఇతర వివరాలకు 87905 44427 నంబర్‌కు ఫోన్ చేసి సంప్రదించాలని ప్రిన్సిపాల్ చందర్ తెలిపారు.
Edupayala Temple | పెరిగిన వరద.. వనదుర్గ ఆలయం మరోసారి మూసివేత
Rayapole | కొత్తపల్లిలో పడకేసిన పారిశుధ్యం.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు
Tragedy | రెండేళ్ల కూతుర్ని పాతిపెట్టి.. ప్రియుడితో పరారైన మహిళ.. మూడు నెలల తర్వాత బయటపడ్డ నిజం!