ఉద్యోగాల పేరిట టోకరా
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, పెట్రోల్ బంకులు ఇప్పిస్తామని చెప్పి అమాయక ప్రజలను మోసం చేసి, వారి నుంచి రూ.1.06కోట్లు వసూలు చేసిన నలుగురు నిందితుల ముఠాను అరెస్ట్ చేసినట్లు జనగామ ఏసీపీ పండేరి చేతన్ నితిన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం అర్బన్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు.
- అమాయకుల నుంచి రూ.1.06 కోట్లు వసూలు
- నలుగురు నిందితుల ముఠా అరెస్ట్
- వివరాలు వెల్లడించిన ఏసీపీ చేతన్ నితిన్
జనగామ చౌరస్తా, మార్చి 17: ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, పెట్రోల్ బంకులు ఇప్పిస్తామని చెప్పి అమాయక ప్రజలను మోసం చేసి, వారి నుంచి రూ.1.06కోట్లు వసూలు చేసిన నలుగురు నిందితుల ముఠాను అరెస్ట్ చేసినట్లు జనగామ ఏసీపీ పండేరి చేతన్ నితిన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం అర్బన్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. ఏసీపీ కథనం ప్రకారం.. జనగామ జిల్లా కేంద్రంలోని పూర్ణిమ కాలనీకి చెందిన పురోహితుడు బెలిగిని శివకుమార్, కరీంనగర్ జిల్లా దమ్మక్కపేటకు చెందిన (ప్రస్తుతం ఆదిలాబాద్ టౌన్) ఎస్ఎస్ కన్సల్టెన్సీ నిర్వాహకుడు ఇల్లందుల శ్రీనివాస్, చిగురుమామిడికి చెందిన పురోహితుడు ఆకవరం సాయిచరణ్, భూపాలపల్లి జిల్లా చిట్యాలకు చెందిన ఫొటోగ్రాఫర్ ధరావత్ రాజేశ్ ముఠాగా ఏర్పడి అమాయకుల అవసరాలను ఆసరాగా చేసుకొని నట్టేట ముంచేవారు. వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారు.
జనగామకు చెందిన పురోహితుడు శివకుమార్ తనకు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ, స్పీకర్ గడ్డం ప్రసాద్‌తోపాటు పోలీసుశాఖలో సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్‌తో చాలా దగ్గరి సంబంధాలున్నాయని అమాయక ప్రజలను నమ్మించేవారు. వారికి స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, పెట్రోల్ బంకులు ఇప్పిస్తానని చెప్పి నలుగురు బాధితుల నుంచి రూ.1.06కోట్ల నగదు వసూలు చేశారు. ఇలా మోసపూరితంగా సంపాదించిన డబ్బులను శివకుమార్ తన అల్లుడు సాయిచరణ్, ఇల్లందుల శ్రీనివాస్, ధరావత్ రాజేశ్‌కు పంపేవాడు.
ఆ తర్వాత ఈ నలుగురు కలిసి ఆ డబ్బులను తమ వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకొని, విలాసవంతమైన జీవితం గడిపేవారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు, పెట్రోల్ బంకులకు ఆశపడి జనగామ చెందిన నలుగురు బాధితులు రూ.1.06కోట్లు కోల్పోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు జిల్లా కేంద్రంలోని హనుమకొండ రోడ్డు పెట్రోల్ బంకు వద్ద నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఏసీపీ తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభకనబర్చిన అర్బన్ సీఐ సత్యనారాయణరెడ్డి, ఎస్సై భరత్, సిబ్బందిని వరంగల్ సీపీ సన్‌ప్రీత్‌సింగ్, వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ అభినందించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

