National flag | ఇండిపెండెన్స్ డే వేడుకల్లో భావోద్వేగ ఘట్టం.. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఇంటిపై రెపరెపలాడిన జాతీయ పతాకం
Independence Day | దేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని(Independence Day )జరుపుకుంటున్న తరుణంలో జమ్మూ కాశ్మీర్‌లోని(Jammu and Kashmir) షోపియాన్ జిల్లాలో హృదయం ఉప్పొంగే దృశ్యం ఆవిష్కృతమైంది.
Independence Day | దేశం తన 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని(Independence Day )జరుపుకుంటున్న తరుణంలో జమ్మూ కాశ్మీర్‌లోని(Jammu and Kashmir) షోపియాన్ జిల్లాలో హృదయం ఉప్పొంగే దృశ్యం ఆవిష్కృతమైంది. మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ లష్కరే తొయిబా(Lashkar-e-Taiba) టాప్ కమాండర్‌గా వ్యవహరిస్తున్న అబిద్ రంజాన్ షేక్ స్వగృహంపై అతని తల్లిదండ్రులు త్రివర్ణ పతాకాన్ని (National flag) సగర్వంగా ఎగురవేశారు. తమ కుమారుడు ఉగ్రవాద బాట పట్టినప్పటికీ, తాము మాత్రం భారతమాత సేవలోనే ఉంటామని, దేశభక్తికి కట్టుబడి ఉన్నామని చాటిచెప్పారు. కాగా, అబిద్ రంజాన్ పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) నుండి కార్యకలాపాలు సాగిస్తున్నట్లు సమాచారం.
కాశ్మీర్ లోయలో జరిగిన అనేక ఉగ్రవాద ఘటనలలో ఇతడి ప్రమేయం ఉన్నందున భద్రతా దళాల అబిద్‌ను మోస్ట్ వాంటెడ్ లిస్టులో చేర్చాయి. అలాగే కాశ్మీర్లో స్థానికేతరులపై దాడులకు ఆదేశించినట్లు కూడా అతనికి పేరుంది. ఉగ్రవాది ఇంటిపై త్రివర్ణ పతాకం ఎగురుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారతీయ కల్చర్‌లో గల భిన్నంత్వంలోని ఏకత్వానికి ప్రతీకగా నిలిచాయని పలువురు నెటిజన్లు ప్రశంసించారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శాంతియుతంగా జరిగాయి. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా జాతీయ జెండాను ఎగురవేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రైతులు యాసంగిలో వరి వేయొద్దు : దాసరి హరిచందన
మేడిగడ్డ దగ్గర బాంబ్ పేలిన శబ్దం వచ్చింది..! దీనిపై విచారణ జరపాలి : మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు
Multi Starrer | ఎన్టీఆర్, అల్లు అర్జున్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్.. కథ కూడా వినిపించారా?
Maruti Patel Dongre | ప్రభుత్వ వైఫల్యంతోనే ఎండిపోతున్న పంటలు : మారుతి పటేల్ డోంగ్రే
‘క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తిస్తే సంపూర్ణ చికిత్స’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

