రాయపోల్, సెప్టెంబర్ 13: అసలే వర్షాలు కురుస్తున్న కాలం. మురికి కాలువలు అపరిశుభ్రంగా ఉండడంతో పాటు. వీధులన్నీ వర్షపు నీటితో నిండి ఇళ్ల మధ్యనే పెంట కుప్పలు ఉండడంతో దోమలు సైరవిహారం చేస్తున్నాయి. దీంతో గ్రామస్తులు రోగాల బారిన పడుతున్నారు. సిద్దిపేట జిల్లా రాయపోల్ (Rayapole) మండలం కొత్తపల్లి గ్రామంలో పారిశుధ్యం పడకేసింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన ప్రత్యేక అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడంతో గ్రామస్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇళ్ల మధ్యనే పెంటకుప్పలు ఉన్నాయని. మురికి కాలువలు తీయడం లేదని. మంచినీటి పైపులు మురికి కాలువలో ఉన్నాయని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో ఇటీవల గ్రామంలో ఒకరికి డెంగు లక్షణాలు వచ్చాయని పుకార్లు వచ్చాయి. అలాగే సీజనల్ వ్యాధులు ఉండటం వలన గ్రామంలో ప్రత్యేక హెల్త్ క్యాంపును ఏర్పాటు చేశారు. మురికి కాలువలు సరిగా లేకపోవడంతో వర్షపు నీరు రోజుల తరబడి ఇండ్ల మధ్యన నిలిచిపోవడంతో నిత్యం రాత్రి దోమలు సైరా విహారం చేస్తున్నాయని. గ్రామ, మండల ప్రత్యేక అధికారులు చూసి చూడనట్లుగా వ్యవరిస్తున్నట్లు గ్రామస్తులు వాపోతున్నారు.
చిన్నపాటి వర్షానికే చిత్తడిగా మారుతున్న అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు. కొత్తపల్లి గ్రామంలో మురికి కాలువలు నిండి ఇండ్లలోకి నీళ్లు రావడంతో చాలా ఇబ్బందులు పడుతూ అధికారులకు తెలిపిన పట్టించుకోకపోవడంతో గ్రామస్తులు వాపోతున్నారు. ప్రతిసారి ఎన్నికల్లో నాయకులు హామీ ఇస్తున్నప్పటికీ తమ సమస్యలు పరిష్కారం మారడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి వర్షాలు పడితే మొత్తం జలమయంగా మారి ఇండ్ల లోకి నీరు వస్తుందని ఆందోళన చెందుతున్నారు.
ప్రత్యేక అధికారుల పాలనలో కూడా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని. అధికారులు పత్తా లేకుండా పోయారని. ఇబ్బంది ఉన్న పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. మురికి కాలువ నిర్మాణం చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని. గతంలో పలుమార్లు అధికారులు నాయకులకు విన్నవించుకున్న ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు చూసి చూడనట్లు వ
వ్యహరిస్తున్నారని. నాయకులు కూడా పట్టించుకోక పోవడంతో తమ కష్టాలు ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు. అధికారులు స్పందించి తమ గ్రామంలో తక్షణమే మురికి కాలువల నిర్మాణం చేపట్టి సమస్యను పరిష్కరించాలని కొత్తపల్లి గ్రామస్తులు పేర్కొంటున్నారు.