Godavarikhani | గోదావరిఖని, ఫిబ్రవరి : తారా ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో మార్చి 28, 29 తేదీలలో గోదావరిఖనిలో రెండు రోజులపాటు జాతీయస్థాయి నృత్య పోటీలు, ఉగాది పురస్కారాలు, నల్ల వజ్రం అవార్డ్స్ ఫంక్షన్ ఘనంగా నిర్వహించనున్నట్లు అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు సంకె రాజేష్, ఇప్టా( IPTA) జాతీయ సమితి నాయకుడు కే స్వామి తెలిపారు.
గోదావరిఖని ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తారా ఆర్ట్స్ అకాడెమీ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటుగా ఉత్తరాఖండ్, తమిళనాడు, అండమాన్ నికోబార్, అమెరికా, మలేషియా, సింగపూర్, స్విట్జర్లాండ్, తైవాన్ తదితర దేశాలలో సైతం కళోత్సవాలు నిర్వహించి, వివిధ రంగాలలో లబ్ద ప్రతిష్టులైన వారిని సముచిత రీతిన సత్కరించడం జరిగిందన్నారు. గోదావరిఖని కేంద్రంగా 2021లో భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలు, ఆజాదీకా అమృత్ మహోత్సవ్, 2024లో విభిన్న రంగాలలో రాణిస్తున్న సుమారు 125 మంది సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబాల పిల్లలను గుర్తించి, నల్ల వజ్రం జాతీయ పురస్కారాలను అందజేయడం జరిగిందన్నారు.
ఈ సంవత్సరం ఉగాదిని పురస్కరించుకొని మార్చి 28, 29 తేదీలలో గోదావరిఖని ఆర్కే గార్డెన్స్ లో ఉగాది ఉత్సవాలు, జాతీయస్థాయి జానపద, శాస్త్రీయ బృంద నృత్యాల పోటీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విజేతలకు నగదు బహుమతితో పాటు జ్ఞాపికలు, సర్టిఫికెట్లతో సత్కరించనున్నట్లు పేర్కొన్నారు. అలాగే విద్య, వైద్యం, పాత్రికేయ, న్యాయవాద, ఉపాధ్యాయ, ఉద్యోగులు, అధికారులు తదితర రంగాలలో రాణిస్తున్న వారిని గుర్తించి ఉగాది పురస్కారాలు, నల్ల వజ్రం అవార్డులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ, టీవీ నటీనటులను అతిథులుగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. నృత్య పోటీలలో పాల్గొనదలచిన కళాకారులు మార్చి 10లోగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 6281252369 నెంబర్లో సంప్రదించాలని కోరారు. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో కళోత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు దామెర శంకర్, మేజిక్ రాజా, దయా నర్సింగ్, కనకం రమణయ్య, పి.చంద్రపాల్ తదితరులు పాల్గొన్నారు.
Virosh Wedding | ఒక్కటైన విరోష్: రాజస్థాన్లో వైభవంగా విజయ్-రష్మిక వివాహం!
Tirumala | తిరుమల ఘాట్ రోడ్డుపై ప్రమాదం.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
Bhu Bharati | భూ భారతిలో రెవెన్యూ సదస్సు అప్లికేషన్లు మాయం