– ఎమ్మెల్యే మందుల సామెల్
అర్వపల్లి, ఫిబ్రవరి 26 : గ్రామాల అభివృద్ధి సర్పంచులతోనే సాధ్యమని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ అన్నారు. గురువారం అర్వపల్లి మండల పరిధిలోని రామన్నగూడెంలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అలాగే కొమ్మాలలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రామన్నగూడెం, కొమ్మలలో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీకాంత్, ఎంపీడీఓ ఝాన్సీ, మండల వైద్యాధికారి నగేష్ నాయక్, ఏఈ కుమారస్వామి, డీసీసీ ఉపాధ్యక్షుడు ధరూరి యోగానందచార్యులు, మండల అధ్యక్షుడు సత్యం,సర్పంచులు కర్నాటి వెంకన్న, చిల్లంచర్ల విద్యాసాగర్, మంచాల రామూర్తి, కృష్ణమూర్తి, కరుణ భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, నసీర్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.