జనగామ, జూలై 24 (నమస్తే తెలంగాణ) : విద్యార్థుల భవిష్యత్‌తో ఆటలాడొద్దని, నీట్ పేపర్ లీకేజీ విషయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలో విద్యార్థుల ఉద్యమానికి సంఘీ భావంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్ వద్ద నిర్వ హించిన విద్యార్థుల నిరసన కార్యక్రమంలో కేంద్రప్రభుత్వ తీరుపై ఆయన విరుచుకపడ్డారు. గతేడాది మాత్రమే కాకుండా ఈ సంవత్సరం కూడా నీట్, సీబీఎస్ఈతో పాటు ఇతర పోటీ పరీ క్షల్లో జరిగిన పేపర్ లీకేజీలకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు.
పేపర్ లీకే జీలను ప్రశ్నించిన అమాయక విద్యార్థులు, విద్యార్థి నాయకులపై నమోదు చేసిన అక్రమ కేసు లను బేషరతుగా ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. లీకేజీ ఘటనపై స్వతంత్ర విచారణ కమిటీని ఏర్పాటు చేసి పూర్తిస్థాయి దర్యాప్తు నిర్వహించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసు కోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని, ప్రస్తుతం వరుసగా పరీక్షలు లీక్ కావడం వల్ల విద్యా వ్యవస్థపై ప్రజల నమ్మకం దెబ్బతింటోందన్నారు. విద్యార్థులను ఉగ్ర వాదుల్లా చూడడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పేరొన్నారు. విద్యార్థుల కోసం బీఆర్ఎస్ పార్టీ, పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని, న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని, ప్రతి విద్యార్థికి అండగా నిలుస్తామని తెలిపారు. కాగా, ఉమ్మడి జిల్లా నుంచి వేలాది మంది బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు ఇందిరా పార్క్‌కు తరలి నిరసన తెలిపారు.