The Paradise | విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గ అమ్మవారిని టాలీవుడ్ నేచురల్ స్టార్ నానితో పాటు ‘ది ప్యారడైజ్’ చిత్ర యూనిట్ దర్శించుకున్నారు. సినిమా సక్సెస్ కావడంతో పాటు, ప్రేక్షకుల నుంచి వస్తున్న అద్భుతమైన స్పందనకు కృతజ్ఞతగా టీమ్ అంతా కలిసి విజయవాడకు పయనమయ్యారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ యాక్షన్ డ్రామా ఇటీవల భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రికార్డు స్థాయి కలెక్షన్లతో దూసుకుపోతోంది. తొలి రోజే రూ.80 కోట్లకు పైగా వసూలు చేసి నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ‘ది ప్యారడైజ్’ సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం ఈ సినిమా రూ.200 కోట్ల క్లబ్ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.
ఈ నేపథ్యంలో విజయవాడ చేరుకున్న నానికి ఆలయ అధికారులు మరియు వేద పండితులు ఘన స్వాగతం పన్నారు. గర్భాలయంలో అమ్మవారిని దర్శించుకున్న నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరియు చిత్ర బృందం భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు నానికి వేదాశీర్వచనం అందించి, అమ్మవారి శేషవస్త్రాలు మరియు తీర్థప్రసాదాలను బహూకరించారు. ఈ చిత్రంలో నాని సరసన కయాదు లోహర్ కథానాయకిగా నటించగా, మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్, సంపూర్ణేశ్ బాబు తదితరులు కీలక పాత్రల్లో తమ నటనతో ప్రేక్షకులను అలరించారు.
Natural Star @NameisNani took the divine blessings at the Kanaka Durga Temple in Vijayawada ❤🔥
Book your tickets for #TheParadise now!
🎟️ https://t.co/QWwS4Ichic pic.twitter.com/0nLeH28Rka— THE PARADISE (@TheParadiseOffl) September 30, 2026