కారేపల్లి, సెప్టెంబర్ 30 : కారేపల్లి మండలం మాదారం గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు పుల్లారావు మృతితో ఆయన కుటుంబానికి గ్రామీణ వైద్యులు అండగా నిలిచారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం పెద్దమండవ గ్రామంలో బుధవారం పుల్లారావు సంస్మరణ సభ నిర్వహించి, ఆయన కుటుంబ సభ్యులకు రూ.40 వేల ఆర్థిక సహాయం అందజేశారు. అంతకు ముందు తోటీ ఆర్ఎంపీలు పుల్లారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గ్రామీణ వైద్యుల సహాయక సంఘం సింగరేణి మండల అధ్యక్షుడు గండమల వెంకటేశ్వర్లు, కార్యదర్శి చిలువేరు రమేశ్ మాట్లాడుతూ పుల్లారావు అకాల మృతి గ్రామీణ వైద్యుల కుటుంబానికి తీరని లోటన్నారు. స్నేహితుడిగా, సహచర వైద్యుడిగా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మిత్రుడిని కోల్పోవడం బాధాకరమని పేర్కొంటూ,పుల్లారావు కుటుంబానికి తమ సంఘం తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యులు వి.వెంకటేశ్వర్లు, సతీష్, వేణు, లక్ష్మీనారాయణ, బాబురావు, రఫీ, ఉపేందర్, లక్ష్మణ్, రాజేష్, నరేష్, మోహన్రావు, మంగ్య, డి.రాజు, బి.రాజు, నాగచారి, సుమంత్, గిరిబాబు, బాబూలాల్, సర్దార్ నాగేందర్, కృష్ణ, కే.కృష్ణ పాల్గొన్నారు.