Borge Brende: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ నుంచి తప్పుకుంటున్నా.. ప్రకటించిన సీఈవో
Borge Brende : వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో బోర్జ్ బ్రెండె తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అమెరికా ఫైనాన్సియర్, సెక్స్ నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్తో లింకున్న కేసులో దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ఆయన వెల్లడించారు.
న్యూఢిల్లీ: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో బోర్జ్ బ్రెండె(Borge Brende) తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అమెరికా ఫైనాన్సియర్, సెక్స్ నేరస్థుడు జెఫ్రీ ఎప్స్టీన్తో లింకున్న కేసులో దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో ఆయన తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఎప్స్టీన్తో మూడు సార్లు బిజినెస్ డిన్నర్లో బోర్జ్ బ్రెండె పాల్గొన్నట్లు ఫైల్స్ ద్వారా తెలిసింది. మెయిల్, టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా ఎప్స్టీన్తో కమ్యూనికేషన్ నిర్వహించినట్లు బోర్జ్పై ఆరోపణలు ఉన్నాయి.
సునితమైన పరిశీలిన తర్వాత.. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో, ప్రెసిడెంట్ హోదాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించానని, సుమారు ఎనిమిదిన్నర ఏళ్ల పాటు సేవలు అందించినట్లు తన ప్రకటనలో బోర్జ్ పేర్కొన్నారు. అయితే తన ప్రకటనలో ఎప్స్టీన్తో లింకు గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. ఎటువంటి అవరోధాలు లేకుండా సంస్థ పనులు కొనసాగాలని భావిస్తున్నట్లు తన లేఖలో చెప్పారు.
గతంలో నార్వే ప్రభుత్వంలో ఆయన అనేక సీనియర్ పదవులను నిర్వర్తించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

