న్యూఢిల్లీ, మార్చి 17: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ స్పీడ్ పెంచింది. దేశీయంగా ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని వచ్చే ఐదు నుంచి ఆరేండ్ల కాలంలో ఏడు నయా ఎస్‌యూవీలను విడుదల చేయనున్నట్టు కంపెనీ ఎండీ, సీఈవో హిసాచి తకేచి తెలిపారు. దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహన మార్కెట్ టాప్‌గేర్‌లో దూసుకుపోతున్నదని, దీంతో తమ ఎస్యూవీ పరిధిని మరింత విస్తరించాలని నిర్ణయించినట్టు చెప్పారు. 2019లో 26.5 శాతంగావున్న ఎస్‌యూవీల మార్కెట్ వాటా 2024 నాటికి 54.7 శాతానికి ఎగబాకిందన్నారు. అలాగే కంపెనీ మార్కెట్ వాటా కూడా 16.8 శాతం నుంచి 19.6 శాతానికి చేరుకున్నది. దీంట్లోభాగంగా ఈ-విటారా, విక్టోరిస్, జిమ్నీ, ఫ్రాంక్స్, గ్రాండ్ విటారా, బ్రెజ్జాను పూర్తిగా మార్చివేసి మళ్లీ విడుదల చేసినట్టు చెప్పారు.