Edupayala Temple | మెదక్ (medak) జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వన దుర్గమ్మ ఆలయం (Edupayala Vanadurgamata Temple) వద్ద వరద ప్రవాహం (Flood water) మరోసారి పెరిగింది. జిల్లాలో కురిసిన భారీ వర్షానికి మంజీరానదిలో వరద ఉధృతి పెరిగింది. గర్భగుడి ముందు నుంచి వరద ప్రవహిస్తున్నది. దీంతో ఆలయాన్ని మరోసారి అధికారులు మూసివేశారు. ఇటీవలే కురిసిన వర్షాలకు దాదాపు నెల రోజులుగా మూతపడిన ఈ ఆలయం మూడ్రోజుల క్రితమే అమ్మవారి మూలవిరాట్ దర్శనాలు పునః ప్రారంభమయ్యాయి. ఇంతలోనే మరోసారి వరద పెరగడంతో ఆలయాన్ని మూసివేయాల్సి వచ్చింది. శనివారం తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి అభిషేకం చేపట్టి సహస్రనామార్చన, కుంకుమార్చన అనంతరం ఆలయాన్ని మూసివేశారు. దుర్గామాతకు రాజగోపురంలో పూజలు నిర్వహిస్తున్నారు.
Also Read..
Rain Alert | ఈ ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం
Renu Agarwal Murder | కూకట్పల్లి హత్య కేసు.. జార్ఖండ్లో నిందితుల అరెస్ట్
KTR | తెలంగాణ సెగను ఢిల్లీకి తాకేలా చేసిన మహోన్నత ఘట్టం సకల జనుల సమ్మె: కేటీఆర్