హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం (Rain Alert) ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. నిర్మల్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అదేవిధంగా ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగాగరెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు (గంటకు 30-40 కి.మీ.) వీస్తాయని వెల్లడించింది. ఇక హైదరాబాద్లో మధ్యాహ్నం వరకు పొడి వాతావరణం ఉంటుందని, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
LOCALISED HEAVY THUNDERSTORMS ALERT TODAY ⚠️⛈️
Today, the Upper air circulation (UAC) centre is falling right on Telangana
Scattered SEVERE THUNDERSTORMS expected in North, West, Central TG districts like Adilabad, Asifabad, Nirmal, Nizamabad, Karimnagar, Jagitial,…
— Telangana Weatherman (@balaji25_t) September 13, 2025