KU | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 19 : కాకతీయ యూనివర్సిటీలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 6వ రోజు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ ఇంగ్లీష్ విభాగాధిపతి, సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ డైరెక్టర్ మేఘనారావు వ్యక్తిగత, వృత్తిపరమైన విజయాల్లో కమ్యూనికేషన్ నైపుణ్యాల ప్రాముఖ్యత అనే అంశంపై విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం వంటి భాషా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునేందుకు అవసరమైన పద్ధతులు, ఉదాహరణలు వివరించారు. అలాగే పోటీ పరీక్షల్లో ఆంగ్ల భాషను సమర్ధవంతంగా ఎలా నిర్వహించుకోవాలనే విషయంపై కూడా విద్యార్థులకు విలువైన చిట్కాలను అందించారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ ఇంచార్జ్ ఐజాక్ ప్రభాకర్, లైబ్రరీ అసిస్టెంట్ జవహర్, లైబ్రరీ సిబ్బంది పాల్గొన్నారు.
సాయంత్రం ‘డిజిటల్ యుగంలో లైబ్రరీల ప్రాముఖ్యత’ అనే అంశంపై ‘రంగోలి పోటీ’ నిర్వహించారు. ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, ప్రిన్సిపాల్ పి.అమరవేణి, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ ప్రిన్సిపాల్ జె.కృష్ణవేణి, మహిళా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ కె.బిక్షాలు వ్యవహరించారు. న్యాయనిర్ణేతలు రంగోలి పోటీలో మొదటి, రెండవ బహుమతులను ప్రకటించారు.
Irregularities | వే బ్రిడ్జిలో అవకతవకలు.. రైస్‌మిల్లును మూసేయాలని రైతుల డిమాండ్
Shaligouraram : మత్స్యకారుల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే మందుల సామేల్
AI Course | యువత కోసం ఫ్రీ AI కోర్స్.. పూర్తిచేస్తే కేంద్ర ప్రభుత్వ సర్టిఫికెట్