పుస్తక సమీక్ష
సెకండ్ హ్యాండ్ ట్రాక్టరైనా కొనుక్కుంటే చాలు తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆరాటపడే గుణశేఖర్ కథ ఇది. తన కుటుంబం చుట్టే ఈ కథంతా సాగినా.. ట్రాక్టర్ కొనడానికి అప్పిచ్చిన పెద్దమనిషి సిద్ధిరాజు, దానికి బీమా చేయించాలని చూసే వెంకటముని, పని కల్పించి సొమ్ము చెల్లించిన ఏలుమలై ఇలా రకరకాల పాత్రలు కథలోకి ప్రవేశిస్తుంటాయి.
ఒక రైతు కథ
సెకండ్ హ్యాండ్ ట్రాక్టరైనా కొనుక్కుంటే చాలు తమ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆరాటపడే గుణశేఖర్ కథ ఇది. తన కుటుంబం చుట్టే ఈ కథంతా సాగినా.. ట్రాక్టర్ కొనడానికి అప్పిచ్చిన పెద్దమనిషి సిద్ధిరాజు, దానికి బీమా చేయించాలని చూసే వెంకటముని, పని కల్పించి సొమ్ము చెల్లించిన ఏలుమలై ఇలా రకరకాల పాత్రలు కథలోకి ప్రవేశిస్తుంటాయి. ఒక వ్యక్తి చుట్టూ చేరిన ఇన్ని పాత్రలు.. అతని జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పాయో ‘చింతల చేను’ నవలలో అందంగా ఆవిష్కరించారు రచయిత ఆర్సీ కృష్ణస్వామిరాజు.
నవల చదువుతున్నంత సేపు గ్రామీణ జీవనం మన కండ్లముందు వికసిస్తుంది. ఇందులోని పాత్రలు మన ఊహలకే పరిమితం కాకుండా రక్తమాంసాలున్న మనుషులుగా చెరగని ముద్రవేస్తాయి.
ఇంతవరకూ రాయలసీమ సాహిత్యం ఆ ప్రాంతపు కరువు, కల్తీ ఎరువులు, మార్కెట్ దోపిడికి నష్టపోయిన రైతన్నల కన్నీళ్ల గురించి వాపోయింది. కానీ, తొలిసారిగా భూమిని నమ్ముకున్న రైతు, ఆ రైతును నమ్ముకున్న ఇతర వృత్తిదారుల పరిస్థితులను వివరించింది. రైతు కష్టాలను కొత్తకోణంలో చూపిన నవల ఇది.
చింతలచేను (నవల)
రచయిత: ఆర్సీ కృష్ణస్వామిరాజు
పేజీలు: 141, ధర: రూ.100
ప్రతులకు: 93936 62821
-రాజు పిల్లనగోయిన
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
NXTinAI | వెండితెరపై కృత్రిమ మేధ హవా.. గ్యాలరీ5 ‘నెక్ట్స్ఇన్ఏఐ’ సదస్సు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

