సిటీబ్యూరో, ఫిబ్రవరి 21 ( నమస్తే తెలంగాణ ) : నగరంలో ప్రమాదకర రసాయనాలు తరలించే వాహనాలు రోజూ రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, ఇతర పేలుడు పదార్థాలు, యాసిడ్ ఆమ్లాలు తదితర డేంజరస్ కెమికల్స్‌ను గమ్యస్థానాలకు చేరుస్తుంటాయి. అయితే ఈ వాహనాలను నడపడానికి సాధారణంగా డ్రైవింగ్ వస్తే సరిపోదు. అందుకు అవసరమయ్యే లైసెన్స్ ఉండాల్సిందే. అదే హజార్డస్ లైసెన్స్. ఇది పొందాలంటే హజార్డస్ డ్రైవింగ్ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది డ్రైవర్లు హజార్డస్ లైసెన్స్ లేకుండానే ప్రమాదకర రసాయనాలు తరలించే వాహనాలను నడుపుతున్నట్టు ఆర్టీఏ అధికారుల దృష్టికి వచ్చింది. ఇటీవల హైదరాబాద్- బెంగళూరు జాతీయ రహదారిపై రసాయనాలు తరలిస్తున్న ట్యాంకర్‌ను బస్సు ఢీ కొట్టింది. ఆ సమయంలో కంటైనర్ నుంచి హైడ్రాలిక్ యాసిడ్ లీక్ అయింది. దీంతో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. ఇలాంటి ప్రమాదాలకు కారణమయ్యే వాహనాల డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడంపై ఆర్టీఏ అధికారులు దృష్టి సారించారు.
శిక్షణయే కీలకం..!!
హజార్డస్.. ఈ లైసెన్స్ చాలా కీలకం. హెవీ మోటార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికీ హజార్డస్ లైసెన్స్ జారీ చేయరు. అందుకోసం ప్రత్యేక శిక్షణ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన సంస్థల్లో ఆ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ లైసెన్స్ ఉన్న వాళ్లు మాత్రమే ప్రమాదకర సామగ్రిని తరలించాల్సి ఉంటుంది. ఇతరులెవ్వరైన తరలిస్తే ఊచలు లెక్కించడంతో పాటు ప్రమాదం సంభవిస్తే ఆ వాహనానికి వచ్చే ఇన్సూరెన్స్ కూడా పోతుంది. ఆర్టీఏ అధికారులు ప్రమాదాల నివారణకు వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్, పేలుడు పదార్థాలతో నిత్యం రోడ్లపై వేలాది వాహనాలు సంచరిస్తూ ఉంటాయి. ఏమాత్రం ప్రమాదం జరిగినా ఆ నష్టం భారీస్థాయిలో ఉంటుంది. అందుకే హజార్డస్ లైసెన్స్‌ల జారీలో ప్రత్యేక దృష్టి సారించారు. ప్రమాదకర సామగ్రి తరలించే డ్రైవర్లు మానసికంగానూ, శరీరకంగానూ ఆరోగ్యంగా ఉండాలి. కారణం వేలాది మంది ప్రాణాలతో పాటు కోట్ల విలువ చేసే ఆస్తులు దగ్ధమయ్యే ప్రమాదకర సామగ్రిని సురక్షితంగా తరలించడంలో వారిది కీలక రోల్.
ప్రమాదకరమైన పదార్థాలు
ప్రమాదం ఎదురైతే..
