న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: గడిచిన ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతులు 30.47 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 9.4 శాతం వృద్ధి సాధించింది. గత కొన్నేండ్లుగా సింగిల్ డిజిట్‌కు పరిమితమైన వృద్ధి..
వచ్చే ఏడాది మాత్రం రెండంకెల వృద్ధిని సాధించాలని ఫార్మా ఇండస్ట్రీ వర్గాలు లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఫార్మా రంగం 60 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, 2030 నాటికి రెండింతలు పెరిగి 130 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఆశిస్తున్నారు. భారత్ ప్రస్తుతం 200 దేశాలకు ఔషధాలను ఎగుమతి చేస్తున్నది.