Bathukamma Festival | హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 20 : చారిత్రక రుద్రేశ్వరస్వామి వేయిస్తంభాల దేవాలయంలో ఈ 21న బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నారు. శనివారం వేయి స్తంభాల దేవాలయ ప్రాంగణంలో జరిగే బతుకమ్మ ఏర్పాట్లను హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, మున్సిపల్ కమిషనర్ చాహత్ వాజ్‌పేయి, మున్సిపల్ అధికారులు, విద్యుత్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ, ఎమ్మార్వో, సిటీ డీసీపీ సలీమా, ఏసీపీ నరసింహారావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, హనుమకొండ సీఐ మచ్చ శివకుమార్, ట్రాఫిక్ సీఐ సీతారెడ్డి, కేంద్ర పురావస్తుశాఖ సీఏ అజిత్, దేవాలయ కార్యనిర్వాహణ అధికారి డి.అనిల్‌కుమార్, ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేందర్‌శర్మ, టూరిజం శాఖ జిల్లా అధికారి శివాజీతో కలిసి కలెక్టర్ దేవాలయ ప్రాంగణమంతా పరిశీలించారు.
తగిన ఏర్పాట్లు చేయాలని, దేవాలయానికి తరలివచ్చే మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తూర్పు గేట్ నుంచి బ్యార్గేట్స్ ఏర్పాటు చేయాలని ఆ బ్యార్గేట్ల ద్వారానే వీఐపీలను మంత్రులను తీసుకురావాలన్నారు. దేవాలయ దర్శనం అనంతరం స్టేజీపైకి స్వాగతించాలని అధికారులను కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. వీఐపీలు బతుకమ్మ ఆడుకోవడానికి స్పెషల్‌గా పెద్ద బతుకమ్మ ఏర్పాటు చేయాలని సూచించారు. దేవాలయ ప్రాంతమంతా విద్యుత్ అలంకరణ ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు.
సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా మైక్ సెట్లు, ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని, ఎక్కువ సంఖ్యలో మహిళా పోలీసులను నియమించాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా సక్రమంగా జరపాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ 22వ తేదీ ఉదయం 7 గంటల వరకు బతుకమ్మ పువ్వులు తొలగించి శుభ్రంగా ఉంచాలని, దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతున్నందున క్లీన్‌గా ఉంచాలని అధికారులకు మున్సిపల్ కమిషనర్ సూచించారు. మాస శివరాత్రి పురస్కరించుకొని దేవాలయంలో రుద్రేశ్వరీ-రుద్రేశ్వరస్వామికి కల్యాణోత్సవం నిర్వహించినట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.
Katamaya Kits | గీతా కార్మికులకు కాటమయ్య కిట్లు పంపిణీ చేయాలి
Kothagudem Urban : ‘దసరా పండుగకు నేటి నుంచి ప్రత్యేక బస్సులు.. 50 శాతం అదనపు చార్జీలు’
Kothagudem Urban : పెన్షన్లు పెంచి పంపిణీ చేయాలి : దాసరి సారధి