కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 20 : దసరా పండుగ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో ఉన్నవారు కొత్తగూడెం ప్రాంతానికి చేరుకోవడానికి శనివారం నుండి ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులను నడుపుతుందని కొత్తగూడెం డిపో మేనేజర్ యు.రాజ్యలక్ష్మీ తెలిపారు. శనివారం డిపో కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కొత్తగూడెం నుండి హైదరాబాద్‌కు, హైదరాబాద్ నుండి కొత్తగూడెంకు ఈ ప్రత్యేక బస్సులను ఈ నెల 20 నుంచి అక్టోబర్ 7వ తేదీ వరకు నడుపుతున్నట్లు చెప్పారు. ప్రతీ టిక్కెట్‌పై 50 శాతం అదనపు చార్జీలను వసూలు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. రద్దీని బట్టి ఆయా సందర్భాల్లో అవసరమైతే బస్సు సర్వీసులను పెంచుతామని, ప్రయాణీకులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టినట్లు ఆమె పేర్కొన్నారు.