కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 20 : ఎన్నికల ప్రచారంలో భాగంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు పెన్షన్లు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, ఆ హామీని వెంటనే నిలబెట్టుకోవాలని ఎంఆర్పీఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి సారధి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా శనివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి, మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేశారు.
ఈ సంధర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 21 నెలలు అవుతోందని, ఇప్పటి వరకు పెన్షన్ల ఊసే సీఎం రేవంత్రెడ్డి ఎత్తడం లేదని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఇప్పుడు హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. వెంటనే పెన్షన్లు పెంచి పంపిణీ చేయాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్.వెంకన్న, వి.విజయభాస్కర్రావు, పి.కస్తూరి, వి.సత్యవతి, టి.నాగలక్ష్మీ, ఎస్.లక్ష్మీ పాల్గొన్నారు.