ఫారూక్ను చంపడానికి 20 ఏండ్లుగా ప్రయత్నిస్తున్నా
జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లాను హత్య చేయడానికి తాను గత 20 ఏండ్లుగా ప్రణాళిక వేస్తున్నానని బుధవారం ఆయనపై కాల్పులకు ప్రయత్నించి పట్టుబడ్డ నిందితుడు తెలిపాడు.
- కాల్పుల నిందితుడు వెల్లడి
శ్రీనగర్, మార్చి 12: జమ్ము కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫారూక్ అబ్దుల్లాను హత్య చేయడానికి తాను గత 20 ఏండ్లుగా ప్రణాళిక వేస్తున్నానని బుధవారం ఆయనపై కాల్పులకు ప్రయత్నించి పట్టుబడ్డ నిందితుడు తెలిపాడు. జమ్ములోని ఒక వివాహానికి హాజరైన 88 ఏండ్ల ఫారూక్ అబ్దుల్లాపై 63 ఏండ్ల జమ్ము వాసి కమల్ సింగ్ జమ్వాల్ బుధవారం పాయింట్ బ్లాక్ రేంజ్లో కాల్పులు జరిపి హత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన నుంచి ఫారూక్, ఉప ముఖ్యమంత్రి సురేందర్ చౌదరి సురక్షితంగా తప్పించుకోగా, జమ్వాల్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు.
ఈ ఘటనలో ఉగ్రవాద కోణం ఏదీ లేదని, నిందితుడు ఆ సమయంలో తాగి ఉన్నట్టు కన్పించిందని పోలీసులు చెప్పారు. కాల్పులకు వాడింది తన సొంత లైసెన్స్డ్ తుపాకీయేనని నిందితుడు చెప్పాడు. ‘ఫారూక్ను చంపుదామని గత 20 ఏండ్ల నుంచి అనుకుంటున్నాను. అది నా వ్యక్తిగత ఎజెండా. కాల్పులు జరిపిన తుపాకీ నాదే. దానికి లైసెన్స్ ఉంది. ఫారూక్ అదృష్టవశాత్తు నా నుంచి తప్పించుకున్నాడు’ అని నిందితుడు పోలీసులకు తెలిపాడు. సింగ్కు పాత జమ్ములో కొన్ని షాపులు ఉన్నాయని తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

