MLA Revuri Prakash Reddy | దామెర: మండలంలోని ల్యాదెళ్లలో ఎస్సారెస్పీకి చెందిన భవనాలలో జరుగుతున్న మరమ్మత్తు పనులను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఇవాళ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అన్నారు.
స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా మహిళలకు కుట్టు శిక్షణ, అల్లికలు తదితర రంగాలలో శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసే శిక్షణ కేంద్రం మహిళలకు ఎంతో ఉపయోగపడుతుందని, మహిళలు తయారు చేసే ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేస్తుందని అన్నారు.
అనంతరం శిక్షణ కేంద్రంలో త్రాగునీటి వసతి, మొక్కల పెంపకం, విద్యుత్తు ఏర్పాటు పనులను కలెక్టర్, ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ నెల 15వ తేదీ తర్వాత శిక్షణ కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క చేతుల మీదుగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో మేన శ్రీను, పరకాల ఆర్డిఓ నారాయణ, తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి, ఎంపీడీవో కల్పన తదితరులు పాల్గొన్నారు.
Pooja Hegde | శ్రీకాళహస్తీ రాహుకేతు పూజలో పాల్గొన్న పూజా హెగ్డే
A Raja: బొట్టు పెట్టుకోవద్దు.. కంకణం కట్టుకోవద్దు.. డీఎంకే నేత ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు