ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి చెక్పోస్టుపై (Wankidi check post ) ఏసీబీ అధికారులు ( ACB Raids ) దాడులు చేసి డ్రైవర్ల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వాంకిడి లోని అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ప్రభుత్వ రవాణా శాఖకు సంబంధం లేని ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు వాహనల నుంచి డబ్బులు వసూలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని వారి వద్ద నుంచి రూ. 45,100 ను పట్టుకుని సీజ్ చేశారు.
ఏసీబీ కరీంనగర్ డీఎస్పీ రమణమూర్తి ( DSP Ramanamurthy ) ఆధ్వర్యంలో జరిగిన ఆకస్మిక దాడుల సమయంలో డ్యూటీ లో కేవలం ఏఎంవీఐ ఐ మాధవి మాత్రమే ఉన్నారు. బయట వాహనాలను ఆపూతూ దగ్గర వసూలు చేస్తూన్న ప్రైవేట్ వ్యక్తులు ఐలయ్య అలియాస్ రవి , విజయ్ కుమార్ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.