హనుమకొండ చౌరస్తా : ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మంగళవారం హనుమకొండ నగరానికి(Hanukonda) రానున్నారు. ఈ మేరకు ఏఐసీసీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలకు సమాచారం అందింది. ఢిల్లీ నుంచి హైదారాబాద్‌కు చేరుకొని అక్కడి నుంచి సాయంత్రం 5.30 గంటలకు హెలికాప్టర్ లో హనుమకొండకు రానున్నారు. ఖాజిపేట్లోని నిట్‌లో(NIT) జరిగే ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. అనంతరం హనుమకొండలోని సుప్ర హోటల్లో కొంతసేపు విశ్రాంతి తీసుకొని 7.30 కి రైలులో తమిళనాడు వెళ్లనున్నారు. ఈ మేరకు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Peanuts With Skin | పల్లీలను పొట్టుతో తినాలా..? పొట్టు తీసేసి తినాలా..? ఎలా తింటే మంచిది..?
Virat Kohli | ఎయిర్‌పోర్ట్‌లో మహిళకు హగ్ ఇచ్చిన కోహ్లీ.. వీడియో వైరల్
Cyber Crimes | సైబర్ నేరాలు..! 805 యాప్స్.. 3వేలకుపైగా వెబ్సైట్ లింక్స్ బ్లాక్..!