Virat Kohli | భారత స్టార్ క్రికెటర్, పరుగుల రారాజు విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. మైదానాంలో మెరుపు షాట్స్‌తో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సొంత చేసుకున్నాడు. కోహ్లీ ఎక్కడికి వెళ్లినా అభిమానులు వెంట పడుతుంటారు. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, ఫొటోలు, సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ కోసం ఎగబడుతుంటారు. అయితే, తాజాగా కోహ్లీ స్వయంగా ఓ మహిళ (Mysterious Woman) దగ్గరకు వెళ్లి హగ్ (Airport Hug) ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇంగ్లాండ్‌తో మూడో వన్డే కోసం భారత జట్టు అహ్మదాబాద్ బయల్దేరింది. ఈ సందర్భంగా ఆటగాళ్లంతా భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. క్రికెటర్లను చూసేందుకు అక్కడికి అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. టైట్ సెక్యూరిటీ మధ్య క్రికెటర్లంతా లోపలికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎయిర్‌పోర్ట్‌లోకి వచ్చిన కోహ్లీ ఓ మహిళను చూసి నేరుగా ఆమె వద్దకు వెళ్లాడు. హగ్ చేసుకొని ఆమెతో ముచ్చటించాడు. ఆ సమయంలో కోహ్లీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమైన కోహ్లీని అక్కడి నుంచి లోపలికి పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఆ లక్కీ లేడీ ఎవరు..? అంటూ ఆరా తీయడం మొదలు పెట్టారు. అయితే, ఆ మహిళ కోహ్లీ బంధువు అని తెలిసింది.
ఇంతకీ ఎవరామే?
అంత టైట్ సెక్యూరిటీ మధ్య ఆమెను చూడగానే దగ్గరకు వెళ్లి హగ్ ఇచ్చారు కోహ్లీ. అసలు ఎవరామే?.. ఆమెకే ఎందుకు హగ్ ఇచ్చాడు కోహ్లీ… పైగా ఆమెతో ఏదో మాట్లాడినట్లు కూడా వీడియోలో కనిపిస్తున్నది. కోహ్లీకి తెలిసిన వ్యక్తి అయుంటుందని అందరూ అనుకుంటున్నారు. లేకపోతే పరిచయం లేని వ్యక్తి దగ్గరకు కోహ్లీ ఎందుకు వెళతాడు అనేది అందరి వాదన. ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
That Hug 🥺❤️ pic.twitter.com/nSkwhmtZUs
— Virat Kohli Fan Club (@Trend_VKohli) February 10, 2025
Also Read..
Jasprit Bumrah | బుమ్రా భవితవ్యం తేలేది నేడే.. చాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడా? లేదా?