Jasprit Bumrah | బెంగళూరు : భారత పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా చాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడా? లేదా? అనేది మంగళవారం తేలనుంది. వెన్ను నొప్పి కారణంగా బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్న బుమ్రా ను చాంపియన్స్ ట్రోఫీలో ఆడించాలా? వద్దా? అన్నదానిపై టీమ్ మేనేజ్మెంట్, సెలెక్టర్లు మంగళవారం కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
ఈ టోర్నీకి ఎంపిక చేసిన ప్రాథమిక జట్టులో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఫిబ్రవరి 12 చివరి తేదీ అవడంతో బీసీసీఐ ఏ నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.ఇదిలా ఉండగా బుమ్రాపై ఎక్కువ భారం పడకుండా కీలక మ్యాచ్లలో మాత్రమే ఆడిస్తారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.