లాహోర్: అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘటన జరిగింది. న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో.. సౌతాఫ్రికా కోచ్.. సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్(Substitute Fielder)గా చేశాడు. పాకిస్తాన్లో జరుగుతున్నమూడు దేశాల టోర్నీలో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఓ ఫీల్డర్ మైదానం విడిచి వెళ్లాడు. ఆ సమయంలో మరో క్రికెటర్ మైదానంలోకి వచ్చేందుకు రెడీగా లేడు. దీంతో సౌతాఫ్రికా ఫీల్డింగ్ కోచ్ వాండిలే గావునే నేరుగా రంగంలోకి దిగాడు. బయటకు వెళ్లిన ప్లేయర్ స్థానంలో అతను ఫీల్డింగ్ చేశాడు.
మూడు దేశాల టోర్నీకి కేవలం 12 మంది ఆటగాళ్లతోనే సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లింది. దీంతో సబ్‌స్టిట్యూట్ ఫీల్డింగ్ చేయడానికి ప్లేయర్లు కరువు అయ్యారు. ఆ దశలో ఫీల్డింగ్ కోచే.. అదనపు ఫీల్డర్‌గా మైదానంలోకి దిగేశాడు. ఎక్కువ శాతం మంది సీనియర్ ఆటగాళ్లు.. దక్షిణాఫ్రికా టీ20 లీగ్‌లో ఆడుతున్న కారణంగా.. న్యూజిలాండ్‌తో జరిగిన ఫస్ట్ వన్డేకు దూరంగా ఉన్నారు. కివీస్ బ్యాటింగ్ చేస్తున్న 37వ ఓవర్లో ఫీల్డింగ్ కోచ్ గావు ఫీల్డింగ్‌కు దిగాడు.
బుధవారం జరిగే రెండో మ్యాచ్‌లో కొందరు సఫారీ ఆటగాళ్లు జట్టులో చేరే అవకాశాలు ఉన్నాయి. క్లాసెన్, కేశవ్ మహారాజ్ జట్టుతో కలిసే ఛాన్సు ఉన్నది. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో కివీస్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. కేన్ విలియమ్సన్ 113 బంతుల్లో 133 రన్స్ చేశాడు. వన్డేల్లో ఏడు వేల పరుగుల మార్క్‌ను కూడా అతను దాటేశాడు.
We don’t see that happening too often! 😅
South Africa’s fielding coach Wandile Gwavu came on as a substitute fielder during the New Zealand innings! 👀#TriNationSeriesonFanCode pic.twitter.com/ilU5Zj2Xxn
— FanCode (@FanCode) February 10, 2025