Suyodhana | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో అలరిస్తున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సుయోధన’. ఈ సినిమాకు సంబంధించి తాజాగా మేకర్స్ ఒక ఆసక్తికరమైన అప్డేట్ను ప్రకటించారు. ఈ చిత్రాన్ని మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్ర బృందం విడుదల చేసిన రిలీజ్ డేట్ పోస్టర్ ప్రస్తుతం సినీ సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది.
ప్రజ్వల లైన్ క్రియేషన్స్ బ్యానర్‌పై బోసుబాబు నిడుమోలు నిర్మిస్తున్న ఈ చిత్రానికి, వై.ఎస్. మాధవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రియదర్శి సరసన ద్రిషిక చందర్ హీరోయిన్గా నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ‘డైలాగ్ కింగ్’ సాయికుమార్ మరియు సీనియర్ నటి ప్రేమ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత బోసుబాబు నిడుమోలు మాట్లాడుతూ, “ఒక మంచి కథ, కథనాలతో అత్యుత్తమ నిర్మాణ విలువలతో ‘సుయోధన’ చిత్రాన్ని రూపొందించాము. ప్రియదర్శి, సాయికుమార్ గారి నటన సినిమాకు ప్రాణం పోశాయి. సంగీత దర్శకుడు జై క్రిష్ అందించిన స్వరాలు, రామజోగయ్య శాస్త్రి గారి సాహిత్యం ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమయ్యాము. త్వరలోనే టీజర్, ట్రైలర్ మరియు పాటలను విడుదల చేస్తాము” అని తెలిపారు.
చిత్ర బృందం:
నటీనటులు: ప్రియదర్శి, ద్రిషిక చందర్, సాయి కుమార్, ప్రేమ, విష్ణు (లడ్డు), దేవి ప్రసాద్, రాజశ్రీ నాయర్ తదితరులు.
నిర్మాత: బోసుబాబు నిడుమోలు
దర్శకత్వం: వై.ఎస్. మాధవ్ రెడ్డి
సంగీతం: జై క్రిష్
సినిమాటోగ్రఫీ: కార్తీక్ కొప్పెర
ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్
ఆర్ట్: బ్రహ్మ కడలి
సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి