Pensioners | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 11 : తెలంగాణ రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 13న ఏకశిలా జయశంకర్ పార్క్ వద్ద జరిగే పెన్షనర్ల మహాధర్నాను విజయవంతం చేయాలని రాష్ర్ట కో-కన్వీనర్ ఎస్ ధర్మేంద్ర పిలుపునిచ్చారు. మంగళవారం హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ వివిధ జిల్లాలలో రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించాలని పోరాటాలు చేస్తున్నదని అందులో భాగంగా 13న వరంగల్ జిల్లాలో జరిగే ధర్నాలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ మాట్లాడుతూ.. ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత తమ శేషజీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. అందుకు తమ ఉద్యోగ జీవితంలో దాచుకున్న జీపీఎఫ్, గ్రాట్యుటీ, 2020 పీఆర్సీ ఏరియర్స్.. ఇవి ఉద్యోగుల హక్కు.. వీటి ద్వారా తమ పిల్లల పెళ్లిళ్లు, గృహం నిర్మించుకోవచ్చని, బ్యాంక్ ఈఎంఐలు కట్టుకొని ప్రశాంత జీవితం గడపాలని ఆశపడ్డారు.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వారి ఆశలు అడియాశలు చేసిందని మండిపడ్డారు.
ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు కందుకూరి దేవదాసు, ఎండి.మహబూబ్అలీ, ఎండి.గఫార్, మేకిరీ దామోదర్, ఈ.ఇంద్రసేనారెడ్డి, బత్తిని సారయ్య, అశోక్‌కుమార్, వెంకటయ్య, రవీందర్, సంజీవరెడ్డి, శ్యాంసుందర్, సాంబయ్య పాల్గొన్నారు.
Dharmasagar | యూనియన్ బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : బ్యాంక్ మేనేజర్ అనిల్
Madhira : లడకబజార్లో ఉచిత వైద్య శిబిరం