ధర్మసాగర్ : యూనియన్ బ్యాంక్ సేవలను రైతులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని బ్యాంక్ మేనేజర్ అనిల్ తెలిపారు. మంగళవారం యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా 107 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం శాఖ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజర్ అనిల్ మాట్లాడుతూ యూనియన్ బ్యాంక్ ముప్పారం శాఖ నందు రైతులకు, మహిళలకు అన్నీ రకాల రుణాలు మంజూరు చేస్తామన్నారు.
బంగారంపై తక్కువ వడ్డీతో రుణం అందిస్తామని దీనిని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బ్యాంక్ ద్వారా తక్కువ వడ్డీతో రుణాలు పొందే అవకాశం ఉందని, కావాల్సిన ధ్రువపత్రాలు తీసుకొచ్చి రుణాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముప్పారం గ్రామస్తులు చామల రవీందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, కోతి సాంబరాజు, గోనెల రాజయ్య, కర్ర రంగారెడ్డి, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.