హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : గురుకుల, మాడల్ స్కూల్ టీచర్లు, కేజీబీవీ ఉపాధ్యాయులకు సైతం హెల్త్కార్డులివ్వాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డిని హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత చికిత్స అందించేందుకు డిజిటల్ హెల్త్కార్డులివ్వడంపై కృతజ్ఞతలు తెలిపిన శ్రీపాల్‌రెడ్డి, మిగిలిన వారికి సైతం హెల్త్కార్డులివ్వాలని కోరారు. దీనిపై సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు. పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి భిక్షంగౌడ్, ఆడిట్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, గురుకుల టీచర్ల సంఘం బాధ్యుడు దిలీప్‌రెడ్డి తదితరులు వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.
గురుకుల సిబ్బందికీ హెల్త్‌కార్డులివ్వాలి: రామలక్ష్మణ్
గురుకులాల్లోని ఉద్యోగులకు సైతం హెల్త్ స్కీమ్‌ను వర్తింపజేయాలని సాం ఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయ సంఘం చైర్మన్ రామలక్ష్మణ్ డిమాండ్ చేశారు. 010 పద్దు ద్వారా వేతనాలు పొందేవారికే ఈ స్కీమ్‌ను వర్తింపజేయడం సరికాదని, గురుకుల ఉద్యోగులకు వర్తింపజేయకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుడుతామని ఆయన హెచ్చరించారు.