మధిర, నవంబర్ 11 : మధిరలోని లడక బజార్లో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాల మేరకు అసంక్రమిక వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా షుగర్, బీపీ, గుండె జబ్బులు వంటి తదితర వ్యాధులపై పీహెచ్సీ వైద్యులు డాక్టర్ పృథ్విరాజ్, డాక్టర్ వి.హేమలత ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. రోగులకు అవసరమైన మందులను పంపిణీ చేశారు. చలికాలం నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు వై.లక్ష్మి, సావిత్రి, ఆశా వర్కర్లు నాగమణి, ముంతాజ్, అజీజ్ ఉన్నిసా పాల్గొన్నారు.